Natural Star Nani: ప్రశాంత్ నీల్‌తో సినిమా.. ఆ ప్రాజెక్ట్ తర్వాతే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా నుంచి నేచురల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వైవిధ్యభరితమైన సినిమాలతో ఒకదానికి మించి మరొక హిట్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్గా ‘వీ, టక్ జగదీశ్’ సినిమాలతో నిరాశపరిచినా.. ‘శ్యామ్ సింగ రాయ్’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే నాని క్రేజీ ప్రాజెక్టుల్ని వరుసగా లైన్లో పెడుతున్నాడు. ‘అంటే సుందరానికీ’ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్న నాని, ‘దసరా’ షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఓ క్రేజీ దర్శకుడితో జత కట్టబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు.. కేజీఎఫ్‌తో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్.
ఈమధ్యే ఈ ఇద్దరి మధ్య కథాచర్చలు జరిగాయని.. ప్రశాంత్ నీల్ నరేట్ చేసిన స్టోరీ విపరీతంగా నచ్చడంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. NTR31 ప్రాజెక్ట్ తర్వాత దీన్ని సెట్స్ మీదకి తీసుకువెళ్ళనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, దీన్ని అతి తక్కువ సమయంలోనే ముగించేలా ప్లాన్ చేస్తున్నారట! పాన్ ఇండియా సినిమానే అయినా, మరీ ఎక్కువ సమయం కేటాయించకుండా, అనతికాలంలోనే ఫినిష్ చేసేలా ప్రణాళికలు వేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అయితే, ఈ కాంబోపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమే అయితే, ఈ చిత్రంతో నాని కెరీర్ మలుపు తిరగడం ఖాయం. అతడు పాన్ ఇండియా స్టార్‌గా అవతరిస్తాడని చెప్పుకోవడంలో సందేహమే లేదు.
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?