Natural Star Nani: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. సీతారామం సినిమాతో తెలుగువాడిగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఇక తాజాగా దుల్కర్ నటించిన సినిమా కింగ్ ఆఫ్ కోతా. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సరసన ఐశ్వర్య లక్ష్మీ నటించగా.. రితికా సింగ్, అనైకా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మూవీగా కింగ్ ఆఫ్ కోతా ఆగస్టు 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. అన్ని భాషల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇక నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్య అతిథిలుగా విచ్చేశారు.
Karthikeya 2: ఇంకా కృష్ణ ట్రాన్స్ లో ఉన్నాం భయ్యా.. అప్పుడే ఏడాది అయిపోయిందా.. ?
ఇక ఈ వేడుకలో నాని మాట్లాడుతూ.. ” అమ్మాయిల్లో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న ఇద్దరు హీరోలు స్టేజి మీదనే ఉన్నారు. రానా, దుల్కర్ అంటే అమ్మాయిలకు పిచ్చి. సీతారామం సినిమాతో దుల్కర్ తెలుగు వాడిగా మారిపోయాడు. దుల్కర్ కెరీర్ లో నేను కూడా భాగమయ్యాను. ఓకే బంగారం సినిమాకు నేను నా గొంతు ఇచ్చాను.మనమందరం పాన్ ఇండియా సినిమాలు అంటున్నాం.. నాకు ఆ పదం నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్ లో పాన్ ఇండియా హీరో అంటే దుల్కర్ అనే చెప్తాను. ఎందుకంటే.. ఒక బాలీవుడ్ డైరెక్టర్ దుల్కర్ కోసం కథ రాస్తాడు.. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ దుల్కర్ కోసం కథను రాస్తారు. కింగ్ ఆఫ్ కోతా ట్రైలర్ చూసాను.. చాలా ప్రామిసింగ్ గా ఉంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. ఐశ్వర్య లక్ష్మీ .. మీ సినిమాలకు నేను చాలా పెద్ద ఫ్యాన్. అన్ని సినిమాలు చూశాను.. చిత్ర బృందం మొత్తానికి కంగ్రాట్స్. ఈ సినిమా మంచి హిట్ అందుకోవాలని కోరుకుంటున్నాను” అని ముగించాడు.