Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Natural Star Nani Released Vijay Antony Starrer Hatya Movie Trailer

Vijay antony: నేచురల్ స్టార్ ఆవిష్కరించిన ‘హత్య’ ట్రైలర్!

Published Date :August 15, 2022 , 6:08 pm
By NTV WebDesk
Vijay antony: నేచురల్ స్టార్ ఆవిష్కరించిన ‘హత్య’ ట్రైలర్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vijay Antony Starrer Hatya Movie Trailer Released: తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి. ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరై సింగమ్ పిళ్ళై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, జీవీజీ రాజు, ‘నిశ్శబ్ధం’ చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, ”విజయ్ ఆంటోనీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన ‘బిచ్చగాడు’ సినిమా తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ వసూళ్లు సాధించింది. ఆయన ఇటీవల తెలుగులో తన సినిమాల ప్రమోషన్ తగ్గించారు. విజయ్ ఆంటోనీ రీసెంట్ సినిమా ‘కిల్లర్’ కూడా నాకు బాగా నచ్చింది. నాలుగేళ్లు ‘బాహుబలి’కి కష్టపడ్డారు కాబట్టే అంత ఘన విజయం దక్కింది. అలాగే ఈ సినిమాకు కూడా కావాల్సినంత సమయం తీసుకుని క్వాలిటీ మూవీ చేశారు. ట్రైలర్ చూస్తే సినిమా క్వాలిటీ అర్థమవుతోంది. విజయ్ ఆంటోనీకి ఈ చిత్రంతో మంచి సక్సెస్ దక్కాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

Also Read

  • EPIC Teaser : ఆసక్తి పెంచేలా 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' టీజర్
  • Toxic Effect: 'మా ఇంటి బంగారం' వాయిదా?
  • Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
  • Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!

నాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, ”నా కెరీర్ లో సైన్ చేసిన మొదటి సినిమా ఇది. తమిళంలో ఈ చిత్రంతో అరంగేట్రం చేస్తున్నాను. నాకు ఇదొక డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఇలాంటి క్వాలిటీ ఫిల్మ్ తో కోలీవుడ్ లోకి ఎంటర్ అవుతానని అనుకోలేదు. తెలుగులో మాత్రం నా మూడవ చిత్రంగా విడుదలవుతోంది. ఇందులో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా దర్శకుడి కలకు ప్రతిరూపం. ప్రతి టెక్నీషియన్ బ్రిలియంట్ గా వర్క్ చేశారు. విజయ్ ఆంటోనీతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఆయన మంచి నటుడే కాదు మంచి వ్యక్తి కూడా” అని చెప్పింది. హీరోయిన్ రితికా సింగ్ మాట్లాడుతూ, ”చిన్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే కల ఉండేది. కానీ బాక్సర్, హీరోయిన్ అయ్యాను. దర్శకుడు ఈ కథ చెప్పి, నా క్యారెక్టర్ ఐపీఎస్ ఆఫీసర్ అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నా డ్రీమ్ రోల్ ఇది. నా మేకోవర్ కూడా స్టైలిష్ గా డిజైన్ చేశారు. మీనాక్షితో నాకు ఎక్కువ సీన్స్ ఉంటాయి. ఆమె ఎంతో సపోర్టివ్ గా ఉంది. హీరో విజయ్ ఆంటోనీలో ఎక్కడా తానొక పేరున్న హీరో అనే ఆటిట్యూడ్ కనిపించదు. టీమ్ అంతా సినిమా కోసం కంఫర్ట్ గా పనిచేసేలా చూసుకున్నారు” అని తెలిపింది.

నిర్మాతల్లో ఒకరైన జి. ధనుంజయన్ మాట్లాడుతూ, ”విజయ్ ఆంటోనీతో మేం ఐదు చిత్రాలు చేస్తున్నాం. గతంలో ‘విజయ రాఘవన్’ రిలీజ్ చేశారు. ఇప్పుడు ‘హత్య’, త్వరలో ‘దోషి’ అనే మరో మూవీ నిర్మిస్తున్నాం. ఈ కథను మంచి క్వాలిటీ ఫిల్మ్ గా చేద్దామని విజయ్ గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. కథ విన్నాక మాకూ అంతే ఇన్ స్పైరింగ్ గా అనిపించింది. గిరీష్ గోపాలకృష్ణన్ ఇంటర్నేషనల్ స్థాయి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా పూర్తిగా దర్శకుడి విజన్ అనుకోవచ్చు. ఆయన అడిగినంత సమయాన్ని ఇచ్చి ఓ మంచి చిత్రాన్ని నిర్మించాం. ప్రొడక్షన్ లో ఎక్కడా రాజీ పడలేదు. ఆ క్వాలిటీని రేపు సినిమాలో మీరంతా చూస్తారు” అని చెప్పారు. సంగీత దర్శకుడు గిరీష్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ, ”నేను గతంలో తెలుగులో ‘నిశ్శబ్ధం’ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాను. ‘హత్య’ చిత్రాన్ని పాన్ ఇండియా అనడం కంటే పాన్ వరల్డ్ మూవీ అని పిలవడం కరెక్ట్. ప్రపంచంలోని ఏ భాషలో విడుదల చేసినా ఈ సినిమా ఆదరణ పొందుతుంది. అంత కంటెంట్ ఈ చిత్రంలో ఉంది. అన్ని ఇండస్ట్రీల్లో టాలీవుడ్ స్పెషల్ ఎందుకంటే ఇక్కడ మంచి చిత్రాలను భాషా హద్దులకు అతీతంగా చూస్తారు. ఈ థ్రిల్లర్ మూవీలో మీకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ మేకింగ్ కు తగినట్లే సంగీతాన్ని అందించాను” అని అన్నారు.

దర్శకుడు బాలాజీ కుమార్ మాట్లాడుతూ, ”’హత్య సినిమా ఒక టిపికల్ మర్డర్ మిస్టరీ. లైలా అనే అమ్మాయి మర్డర్ నేపథ్యంతో సాగుతుంది. ఆ హత్య ఎవరు చేశారు, ఎలా చేశారు అనే ప్రశ్నలు కథలో కీలకంగా ఉంటాయి. మొత్తంగా చూస్తే విజయ్ ఆంటోనీ కంటే కొద్దిగా రితికా క్యారెక్టర్ కు వెయిట్ ఉంటుంది. అలాగే లైలా గా మీనాక్షి కూడా కీలక పాత్ర పోషించింది. ఆమె క్యారెక్టర్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూనే కథ తిరుగుతుంది. సినిమాలో మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే అంశాలెన్నో ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ కు ఏడాది సమయం తీసుకుని చేశామంటే క్వాలిటీ కోసం మేం ఎంత ప్రయత్నించామో అర్థం చేసుకోవచ్చు” అని అన్నారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ, ”మా దర్శకుడు బాలాజీ కుమార్ ఆల్ రౌండర్ అని చెప్పాలి. ఆయనకు ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ …ఇలా ప్రతి క్రాఫ్ట్ మీద పట్టుంది. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనైనా స్టార్స్ తో సినిమా చేయగల సత్తా ఆయనకుంది. ఈ చిత్రాన్ని వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కించారు. లోటస్ పిక్చర్స్, ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థల్లో నటించడం సంతోషంగా ఉంది. వాళ్లతో మరిన్ని చిత్రాలు చేస్తాను. ఇతర భాష నుంచి వచ్చినా మమ్మల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వాళ్లకు థాంక్స్. సంగీత దర్శకుడు గిరీష్ హాలీవుడ్ స్థాయి సంగీతాన్ని ఇచ్చారు. ఈ మర్డర్ మిస్టరీ మూవీ మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది” అని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hatya Trailer
  • Nani Released Hatya Trailer
  • natural star nani
  • Vijay Antony
  • Vijay Antony Hatya

తాజావార్తలు

  • EPIC Teaser : ఆసక్తి పెంచేలా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్

  • Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!

  • Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?

  • Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!

  • Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..

ట్రెండింగ్‌

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions