Site icon NTV Telugu

Jersey: హిందీ జెర్సీపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే స్పెషల్ మూవీ గా తెరకెక్కిన చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఇక ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. హిందీలో కూడా గౌతమ్ తిన్ననూరినే దర్శకత్వం వహించాడు. ఇక కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 22న విడుదలైంది. ఇక తెలుగులో మంచి విహాయన్ని అందుకున్నట్లే.. హిందీలో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది.

ఇక తాజాగా ఈ సినిమాపై న్యాచురల్ స్టార్ నాని  ప్రశంసలు కురిపించాడు.  ‘జెర్సీని చూశాను. గౌతమ్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేశాడు. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ నటనతో మనసులను కొల్లగొట్టారు. పంకజ్ కపూర్ సర్,  మరియు నా కొడుకు రోనిత్ కూడా ఇరగదీశారు. నిజమైన సినిమా అంటే ఇది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version