మన భారతీయ సినిమాలకి ఇతర దేశాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. కాగా ఇలాంటి కీర్తిని సంపాదించడంలో కీలక పాత్ర వహించింది మాత్రం గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పాలి. తాను తెరకెక్కించిన ‘బాహుబలి 2’, ‘RRR’ సినిమాలు సంచలన విజయాలు సాధించి వరల్డ్ వైడ్ సినిమా దగ్గర భారీ పాపులారిటీ తెచ్చుకున్నాయి. అయితే ఒకపుడు సినిమా పెద్ద హిట్ అయింది అంటే అది థియేటర్స్ లో ఎన్ని రోజులు రన్ అయ్యింది అనే దాని మీద ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి.కేవలం వసూళ్లు ఆధారంగా సినిమాల ఫలితాలు లెక్కిస్తున్నారు.
Also Read: Krithi Shetty: ఫ్యాన్స్‌కి ఊహించని షాక్ ఇచ్చిన కృతి శెట్టి..
ఇలాంటి డిజిటల్ వరల్డ్ లో కూడా ఓ సినిమా 50 లేదా 100 రోజులు రన్ అవ్వడం అనేది గగనం. చెప్పాలంటే మన దేశంలో.. మన సినిమా.. మన దగ్గర 50 రోజులు ఆడని రోజులు ఇవి. అలాంటిది ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా జపాన్ దేశంలో ఒక సంవత్సరం 9 నెలలు ఓకె స్క్రీన్ లో హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యిందట. ఇక ఈ సక్సెస్‌ని దృషటిలో పెట్టుకుని ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ ని కూడా జపాన్ లో విడుదల చేశారు. కానీ ఆదరణ దక్కలేదు. టీమ్ అంత వెళ్లి ప్రమోషన్లు చేసినా ఓపెనింగ్ తప్ప లాంగ్ రన్ దొరకలేదు.
అలాంటి ఇప్పుడు నాని నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ జపాన్‌లో రిలీజ్ కి సిద్దం అయింది. ‘సూర్యాస్ సాటర్డే’ పేరుతో ఫిబ్రవరి 14 అక్కడి ఆడియన్స్ కోసం థియేటర్లలో విడుదలకానుంది. నిజానికిది ఇది కొంత రిస్క్‌తో కూడుకున్నదే. ఎందుకంటే అక్కడ విడుదలైన అన్ని ఇండియన్ మూవీస్ ఒకే స్థాయిలో విజయం సాధించలేదు. అందులోనూ ఆ మూవీ పెద్దగా హిట్ టాక్ కూడా తెచ్చుకోలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.