Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్…ఇలా ఎవరి సమస్యలు వారికి ఉన్నాయని, వాటిని కూర్చుని చర్చించుకుని ఎవరికీ ఇబ్బందులు తలెత్తని రీతిలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, “నేను నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా కూడా సుదీర్ఘ అనుభవంతో చెబుతున్నాను. ఎగ్జిబిటర్స్ అయినా నిర్మాతలు అయినా కేవలం తమ సమస్యలు మాత్రమే హైలైట్ చేసుకోవడం, అవి మాత్రమే పరిష్కారం కావాలనుకోవడం కరెక్ట్ కాదు. సమస్యను ఎప్పుడైనా రెండు వైపులా చూడాలి. ఇప్పుడు అలా చూడకుండా తమ సమస్య మాత్రమే పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. నిన్న ఎగ్జిబిటర్స్ పెట్టిన ప్రెస్ మీట్ లో సింగిల్ థియేటర్స్ కు రేట్ల పెంపు జీవో ఇచ్చినా అమలు పరచమని చెప్పడం ఎంతమాత్రం సహేతుకం కాదు. సింగిల్ థియేటర్స్ సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. మల్టీ ఫ్లెక్స్ థియేటర్స్ ఎంత తక్కువమంది ప్రేక్షకులు వచ్చినా సినిమాను రన్ చేస్తారు. సింగిల్ థియేటర్స్ కు అలా రన్ చేయడం కష్టమవుతుంది. సింగిల్ థియేటర్స్ కు పర్సంటేజీ అడగడం కరెక్ట్ కాదు. రెంటల్ కొంతమేరకు హైక్ అడగవచ్చు.
ఇలా అనేక సమస్యలు ఇరువైపులా ఉన్నాయి. అలాగే చిన్న సినిమాకు న్యాయం జరగాలి. చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత అందరూ బావుండాలి. ఈ నెల 15న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరగబోయే సమావేశంలో అందరి శ్రేయస్సు ను కాంక్షిస్తూ నిర్ణయాలు జరగాలి” అని అన్నారు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణమని ఈ సందర్భంగా నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. దిల్ రాజు వర్సెస్ మైత్రీ మధ్య కోల్డ్ వార్ వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ కుటుంబం సినిమాల విడుదలకు ముందు కావాలని పని కట్టుకుని సమస్యలను సృష్టిస్తున్నారని, ప్రతీసారి వారినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆయన ప్రశించారు. జూన్ 4న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైన సమయంలో అంతకుముందు ఎప్పుడూ వీరికి సమస్యలు కనిపించలేదా? సినిమా విడుదలకు ముందు ఇలా సమస్యలు సృష్టిస్తూ…జీవో లను సైతం అమలు చేయమని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలని అన్నారు. ఇలా అభిమానుల్లో కలవరం కలిగించడం కరెక్ట్ కాదని…అయినా ఎట్టి పరిస్థితులలో పెద్ది సినిమాను ఆపలేరని ఆయన అన్నారు.
Also Read
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
- Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
- Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
- Jayaho Ramanuja: సంస్కృతంతో సహా ఆరు భాషల్లో 'జయహో రామానుజ'
తాజావార్తలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
-
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
-
Special Executive Magistrate: బ్రిటిష్ పాలన పోయినా.. నిర్బంధ చట్టాలు పోలేదా?
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!