Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్

Rashmika Mandanna 300kb

Rashmika Mandanna 300kb

Rashmika Mandanna: తుంటి గాయం కారణంగా కొంతకాలంగా షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే రష్మికకు ఈ బ్రేక్ కాస్త భిన్నమైన అనుభూతిని ఇచ్చింది. షూటింగ్‌లు, ప్రయాణాలు, ప్రమోషన్స్‌కు దూరంగా ఇంట్లోనే ప్రశాంతంగా గడుపుతూ తనకు నచ్చిన పనులతో టైమ్ పాస్ చేసింది రష్మిక. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోలు చూస్తే.. ఈ విరామాన్ని రష్మిక ఎంతగా ఆస్వాదించిందో అర్థమవుతోంది. అయితే ఇంతకాలం దూరంగా ఉన్న తర్వాత మళ్లీ షూటింగ్‌కు వెళ్లబోతున్నానంటూ ఆమె చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రీసెంట్ గా రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె తన ఇంట్లో గడిపిన సాధారణమైన, ప్రశాంతమైన క్షణాలు కనిపించాయి. రంగురంగుల జిగ్సా పజిల్‌తో ఆమె కాలక్షేపం చేస్తున్న ఫొటో ఆకట్టుకుంది. అంతేకాదు రష్మిక బ్రేక్‌లో కేవలం ఇంట్లోనే ఉండిపోకుండా ప్రకృతిని కూడా ఆస్వాదించింది. ఆమె షేర్ చేసిన మరో ఫొటోలో పచ్చని వాతావరణం మధ్యలో ఒక నెమలి కనిపించింది. షూటింగ్‌ల హడావుడికి దూరంగా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో గడిపిన సమయం తనకు ఎంతో రిలాక్సింగ్‌గా అనిపించినట్లు ఆమె పోస్ట్ ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, తన పెంపుడు కుక్కతో గడిపిన క్యూట్ మూమెంట్‌ను కూడా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు రష్మిక తన బ్రేక్ సమయంలో ఎంత ప్రశాంతంగా గడిపిందో చూపిస్తున్నాయి.

ఈ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రష్మిక, త్వరలోనే తిరిగి పనిలోకి వెళ్తున్నానని, అయితే ప్రస్తుతం తాను ఆస్వాదిస్తున్న ఈ క్షణాలను ఖచ్చితంగా మిస్ అవుతానని పేర్కొంది. దీంతో త్వరలోనే రష్మిక మళ్లీ షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రష్మిక చేతిలో కూడా వరుస క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘మైసా’తో పాటు ‘రణబాలి’లో ఆమె నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’లోనూ ఆమె భాగమని సమాచారం. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘యానిమల్ పార్క్’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా ఒకేసారి పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మికకు ఈ బ్రేక్ తనను తాను రీఛార్జ్ చేసుకునే అవకాశంగా మారింది. ఇన్నాళ్లు షూటింగ్స్‌కు దూరంగా ఇంట్లో ప్రశాంతంగా గడిపిన రష్మిక ఇప్పుడు మళ్లీ తన సినీ ప్రయాణంలోకి అడుగుపెట్టబోతోంది. ఇక రష్మిక రీఎంట్రీ ఏ సినిమా షూటింగ్‌తో మొదలవుతుందో, కొత్త షెడ్యూల్‌లో ఎలాంటి అప్‌డేట్స్ ఇస్తుందో అని అభిమానులు కూడా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు.