PVNS Rohit : ఈ నడుమ స్టార్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా మరో స్టార్ సింగర్ ఇదే బాట పట్టాడు. అతనెవరో కాదు బేబీ సినిమాకు గాను నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న రోహిత్. ఇతను చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ఎన్నో పాటలు పాడాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా వచ్చిన సెన్సేషనల్ మూవీ బేబీలో ఇతను ఓ రెండు ప్రేమ మేఘాలు అనే పాట పాడాడు. ఈ పాటకు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డు దక్కింది. అంతకు ముందు జైలర్, హనుమాన్, నేల టికెట్, కొండపొలం లాంటి సినిమాలకు అతను పాటలు పాడాడు. బేబీ మూవీతో నేషనల్ వైడ్ గా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. అతను ఎంతో కాలంగా డాక్టర్ శ్రేయ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.
Read Also : Rashmika : ఎవరినీ తొక్కాలని చూడొద్దు.. రష్మిక షాకింగ్ కామెంట్స్
తాజాగా ఆమెతో సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరిగినట్టు తెలుస్తోంది. కొత్త జంటలకు ఇండస్ట్రీలోని ప్రముఖులు, నెటిజన్లు విషెస్ చెబుతున్నారు. అతిత్వరలోనే పెళ్లి ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు రోహిత్ రెండు సినిమాల్లో పాటలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కువగా మెలోడీ సాంగ్స్ తోనే అతను ఫేమస్ అయ్యాడు.
Read Also : Radhika Apte : ప్రెగ్నెంట్ టైమ్ లో ఆ నిర్మాత ఇబ్బంది పెట్టాడు.. హీరోయిన్ ఎమోషనల్
