బిగ్ బాస్ నాన్-స్టాప్ ఫిబ్రవరి 26న గ్రాండ్ లాంచ్ అయిన విషయం తెలిసిందే. షో స్టార్ట్ అయ్యి కేవలం రెండు రోజులు మాత్రమే కాగా… ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఫర్వాలేదనిపిస్తోంది. అయితే ఓటిటి ప్లాట్‌ఫామ్ లైవ్ స్ట్రీమింగ్‌లో కొంత సమస్య ఉందని బిగ్ బాస్ నాన్‌స్టాప్ వీక్షకులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇదిలా బిగ్ బాస్ నాన్ స్టాప్ బోరింగ్ గా ఉందని, హౌస్ లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాస్క్ లు జరగడం లేదని నెటిజన్లు అంటున్నారు. కంటెస్టెంట్స్ కేవలం చిట్-చాట్ చేసి షోకి కంటెంట్ అందించి, వీక్షకులకు వినోదాన్ని పంచే బదులు తమ సొంత పనులు చేసుకుంటున్నారని అంటున్నారు. కాబట్టి చాలా మంది వీక్షకులు లైవ్ ఎపిసోడ్ కంటే ఒక గంట ఎపిసోడ్‌ను ఇష్టపడుతున్నారు. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో వారియర్స్ Vs ఛాలెంజర్స్ టాస్క్‌లు బాగా జరిగాయి. ఇంటర్వ్యూ టాస్క్‌లో యోధులు ఛాలెంజర్‌లపై గెలిచినట్లు తెలుస్తోంది.
Read Also : Nagababu : కొడాలి నాని లాంటి ఆర్టిస్టులతో సినిమాలు తీయండి… హీరోయిన్ల విషయానికొస్తే…
అయితే హౌజ్ లో ఇప్పుడే ఆట మొదలైనట్లు కన్పిస్తోంది. గత సీజన్ లో చిన్న పిల్లాడిలా ప్రవర్తించి తొందరగానే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్ మళ్ళీ డ్రామా మొదలెట్టారు. బయట మాట్లాడుకునే వచ్చారని, కావాలనే తనను అందరూ టార్గెట్ చేశారని మండిపడ్డాడు. హాట్ స్టార్ విడుదల చేసిన తాజా ప్రోమోలో అయితే ఏకంగా చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కన్పించాడు. తనను ఎవరన్నా చిన్న మాటన్నా పడని నటరాజ్ మాస్టర్ మరి ఈ ఓటిటి వెర్షన్ లో హౌజ్ మేట్స్ తో కలిసి ఎంతకాలం ఉంటారో చూడాలి.