Nasser: జీవచ్ఛంలా కన్నకొడుకు.. నాజర్ జీవితంలో ఇంత విషాదమా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nasser: నటుడు నాజర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నాజర్ తెలియని ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. వయస్సు పెరిగినా.. ఆరోగ్యం సహకరించకపోయినా నాజర్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రతి మనిషి జీవితంలో సుఖాలు ఎలా ఉంటాయో కష్టాలు కూడా అలానే ఉంటాయి. సినీ సెలబ్రిటీల జీవితాలు పైకి వెలుగుతూ కనిపించినా వాటి వెనుక చీకటి కోణాలు చాలానే ఉంటాయి. నాజర్ జీవితంలో కూడా అలాంటి ఒక విషాదం చోటుచేసుకుంది. అయితే ఇప్పటివరకు నాజర్ ఇంట్లో జరిగిన విషాదం గురించి చాలా తక్కువమందికే తెలుసు. నాజర్ కు ముగ్గురు కొడుకులు. నూరుల్ హజన్, లుఫ్తీన్, అబి మెహ్తీ హసన్. వీరిలో పెద్ద కొడుకు తప్ప.. ఇద్దరు కొడుకులను నాజర్ హీరోలుగా చేశాడు. ప్రస్తుతం వారు నటులుగా కొనసాగుతున్నారు. ఇక నాజర్ పెద్ద కొడుకు విషయంలోనే విషాదం చోటుచేసుకుంది. నూరుల్ హజన్ అలియాస్ అబ్దుల్ ఫైజల్ హాసన్. చిన్నతనం నుంచి తండ్రిని చూస్తూ పెరిగి .. హీరోగా మారాలనుకున్నాడు. కొడుకు కోరికను నాజర్ కాదనలేదు. అన్ని అనుకోని హీరోగా లాంచ్ చేసే ఏడాదే.. అతనికి పెద్ద కారు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడు. నిజం చెప్పాలంటే జీవచ్ఛవంలా మారిపోయాడు.
Virat Karrna: పెదకాపుపై ప్రభాస్ కన్ను పడేనా.. కుర్ర హీరో కోరిక తీరేనా.. ?
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
గతం గుర్తు లేదు.. సొంత తల్లి దండ్రులను కూడా గుర్తుపట్టలేని స్థితి. తల్లిదండ్రులకు అంతకు మించిన నరకం మరొకటి ఉండదు అనే చెప్పాలి. అయినా కొడుకు ప్రాణాలతో ఉన్నాడు అని నాజర్ కుటుంబం సంతోష పడింది. 2014 లో జరిగిన ఈ ప్రమాదం నాజర్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా జీవచ్ఛవంలా మారడం చూసి నాజర్ కృంగిపోయాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అబ్దుల్ ను వారు చిన్న పిల్లాడిలా చూసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. అబ్దుల్ కు ఎవరు గుర్తులేకపోయినా హీరో విజయ్ మాత్రం గుర్తు ఉన్నాడు. ఆయన కనిపిస్తే ఆనందంతో ఎగిరి గంతులు వేస్తాడట. ఈ విషయం తెలిసి విజయ్.. ఈ ఏడాది నాజర్ పెద్ద కొడుకు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో నాజర్ అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏదిఏమైనా ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..