Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్

Premalu 2

Premalu 2

మలయాళంతో పాటు తెలుగులోనూ సంచలన విజయం సాధించిన లవ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ప్రేమలు’. కేవలం రూ. 3 కోట్ల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.130 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌తో హీరో నెస్లన్, హీరోయిన్ మమితా బైజుకు సూపర్ క్రేజ్ వచ్చేసింది. ఈ భారీ సక్సెస్ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ప్రేమలు 2’ ఉంటుందని మేకర్స్ గతంలో ప్రకటించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ‘ప్రేమలు 2’ సీక్వెల్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మేకర్స్ పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం మొదటి భాగం తెచ్చిన హైప్ మరియు క్రేజ్ మాత్రమే నమ్ముకుని సినిమా చేయలేమని సరైన కథ లేకుండా సీక్వెల్ తీస్తే ప్రేక్షకులను మెప్పించలేమని భావించి సీక్వెల్ ను క్యాన్సిల్ చేశారు మేకర్స్.  ‘ప్రేమలు 2’ కోసం దర్శకుడు మరియు టీమ్ ఎంత ప్రయత్నించినప్పటికీ స్క్రిప్ట్ అనుకున్నంత రాలేదని రాసుకున్న స్టోరీకూడా హీరో నస్లీన్ కు నచ్చలేదట.ఈ నేపథ్యంలో మరికొన్ని వర్షన్ రెడీ చేసినప్పటికీ  హీరో సైడ్ నుండి రెడ్ సిగ్నల్ రావండతో బలవంతంగా సినిమాను లాగడం కంటే ప్రాజెక్ట్‌ను ఇక్కడితో ఆపేయడమే మంచిదని మేకర్స్ ప్రేమలు 2ను సెల్వ్ చేసేసారు. ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ‘ప్రేమలు’ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు కాస్త నిరాశ అనిపించినా కథ లేకుండా సీక్వెల్ తో సొమ్ము చేసుకోకుండా సినిమాని ఆపేసిన మేకర్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

×
×
Ad