Site icon NTV Telugu

Naseeruddin Shah: ‘ఆర్ఆర్ఆర్, పుష్ప’పై సీనియర్ నటుడు సంచలన ఆరోపణలు

Naseeruddin Shah admitted to hospital

Naseeruddin Shah criticises RRR and Pushpa : ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా నటన విషయంలో ఎంత ఫేమస్సో తన అభిప్రాయాలు కూడా బద్దలు కొట్టే విషయంలో కూడా అంతే ఫేమస్. తో పాటు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. గతంలో వివేక్ అగ్నిహోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’, ‘గదర్ 2’ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన ఇప్పుడు ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ను గెలుచుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సహా అల్లు అర్జున్ ‘పుష్ప’ గురించి తన స్పందన తెలియచేశారు. ఎస్ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, సుకుమార్ ‘పుష్ప’ సినిమాలు చూసేందుకు ప్రయత్నించానని, అయితే అంతసేపు కూర్చోలేకపోయానని చెప్పాడు. అంటే ఆ సినిమాల్లో అంత స్టఫ్ ఏమీ లేదని అర్ధం వచ్చేలా ఆయన కామెంట్ చేశారు. హైపర్‌మాస్కులినిటీని చిత్రీకరించడం వల్ల ఆ రెండు చిత్రాలను తాను చూడలేకపోయానని ఆయన అన్నారు.

Leo: ఆడియో లాంచ్ కి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం… లేని ఈవెంట్ కి బ్లాక్ లో టికెట్స్

“నేను RRR, పుష్ప చూడలేకపోయాను కానీ, మణిరత్నం పొన్నియిన్ సెల్వన్‌ని చూశాను, ఎందుకంటే అతను ఎజెండా లేని దర్శకుడు అని అన్నారు. ఈ సినిమాలు చూడడం ద్వారా ప్రేక్షకులు ఏమి పొందుతారో నేను ఊహించలేనని అన్నారు. తమిళ, కన్నడ, మలయాళం, తెలుగు పరిశ్రమల నుంచి వస్తున్న సినిమాలు హిందీ చిత్ర పరిశ్రమలో చేసిన సినిమాల కంటే ఊహాజనితంగా, అసలైనవిగా ఉంటాయని గతంలో నసీరుద్దీన్ షా చెప్పారు. ఇక ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ మరియు ‘గదర్’ చిత్రాల విజయాన్ని ‘డిస్టర్బ్’గా గతంలో నసీరుద్దీన్ షా అభివర్ణించడంతో వివేక్ అగ్నిహోత్రి, సుదీప్తో సేన్, అనిల్ శర్మ వంటి వారి నుండి చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

Exit mobile version