గత ఏడాది “నాంది” చిత్రం తిరిగి ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో అల్లరి నరేష్. ప్రస్తుతం ఆయన చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి “సభకు నమస్కారం”. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక మరొక చిత్రం ఏఆర్ మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతోంది. ఈ చిత్రం ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రంలో శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ ఆనంది కథానాయికగా నటిస్తోంది. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా సినిమా టైటిల్‌ని ప్రకటించారు.
Read Also : Happy Sri Rama Navami : ఫ్యాన్స్ కు చిరు విషెస్
ఈ చిత్రానికి “ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా టైటిల్ ను రివీల్ చేశారు. ఈ క్రేజీ టైటిల్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే “పుష్ప” సినిమాతో మారేడుమిల్లి అనే ప్రాంతం పేరు జనాల నోట్లో బాగా నానింది. ఈ టైటిల్ ఖచ్చితంగా అల్లరి నరేష్ సినిమాకు హెల్ప్ అవుతుందని అంటున్నారు. హాస్య మూవీస్ అండ్ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.