Site icon NTV Telugu

Naresh Pavitra Lokesh: ఓరీవారి… మళ్లీ పెళ్లి అనేది సినిమానా?

Naresh Parvitra Lokesh

Naresh Parvitra Lokesh

నరేష్, పవిత్ర లోకేష్… ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యపెనింగ్ నేమ్స్. యంగ్ స్టార్ హీరో, హీరోయిన్ కలిసి కనిపించినా రానంత క్రేజ్ నరేష్-పవిత్ర లోకేష్ ల పేరు వినిపిస్తే వచ్చేస్తుంది. అంత సెన్సేషన్ చేసిన ఈ జంట, ఇటివలే పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నరేష్-పవిత్రాల పెళ్లి అయిపొయింది అనే వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది అంటే ఈ కపుల్ పై పబ్లిక్ ఎంత ఇంటరెస్ట్ చూపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే మరోసారి అందరికీ షాక్ ఇస్తూ… నరేష్ ఎవరూ ఊహించని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. గతంలో బయటకి వచ్చిన ఫోటోలు అంతా పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని చెప్తూ… “మళ్లీ పెళ్లి” అనే సినిమా అనౌన్స్ చేసాడు. టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లు కూడా రిలీజ్ చేసాడు నరేష్. తన హోమ్ బ్యానర్ ‘విజయకృష్ణ మూవీస్’ తెలుగు ఆడియన్స్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలని ఇచ్చింది.

విజయ నిర్మల మరణించిన తర్వాత ఈ బ్యానర్ పై ఎలాంటి సినిమాలు బయటకి రాలేదు. ఇన్నేళ్ల తర్వాత విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పెట్టిన 50వ వసంతంలో మళ్లీ ఆ లెజండరీ బ్యానర్ పై నరేష్ ‘మళ్లీ పెళ్లి’ సినిమాని నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కింగ్, సంక్రాంతి రాజుగా పేరు తెచ్చుకున్న ప్రొడ్యూసర్ టర్న్డ్ డైరెక్టర్ ఎమ్మెస్ రాజు ‘మళ్లీ పెళ్లి’ సినిమాని తెలుగు-కన్నడ బాషల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి రానున్న ‘మళ్లీ పెళ్లి’కి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ తో పాటు శరత్ బాబు, జయసుధ, వనిత విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, అన్నపూర్ణ, ప్రవీణ్ యెండమూరి తదితరులు నటిస్తున్నారు. నరేష్ పవిత్రాల పెళ్లి తనతంగం అంతా సినిమా ప్రమోషన్ కోసం అని అర్ధమవ్వడంతో “ఇదంతా సినిమా కోసమా?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Exit mobile version