Site icon NTV Telugu

Malli Pelli: నరేష్ కి షాక్ ఇచ్చిన మాజీ భార్య రమ్య రఘుపతి

Malli Pelli

Malli Pelli

సీనియర్ యాక్టర్ నరేష్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఈ మధ్య కాలంలో ఏ ఆన్ స్క్రీన్ పెయిర్ కూడా నరేష్-పవిత్రల రేంజులో హల్చల్ చెయ్యలేదు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా రిలేషన్ లో ఉన్న ఈ ఇద్దరూ గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అనే చెప్పాలి. ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేస్తున్న మళ్లీ పెళ్లి సినిమా మే 26న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నరేష్-పవిత్రలు సోషల్ మీడియాకి కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. మంచో చెడో పక్కన పెడితే నరేష్-పవిత్రాలు ఆడియన్స్ ని తమ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసారు. ఇక సినిమా ఎలా ఉంటుంది? ఎంతవరకు ప్రేక్షకులని మెప్పిస్తుంది అనేది మే 26న తేలనుంది. ప్రమోషన్స్ అయిపోయాయి ఇక మళ్లీ పెళ్లి సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో నరేష్ కి ఊహించని షాక్ ఇచ్చింది నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి. మళ్లీ పెళ్లి సినిమా తన క్యారెక్టర్ డీఫేమ్ చేసేలా ఉందంటూ రమ్య రఘుపతి కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించింది. మళ్లీ పెళ్లి సినిమా విడుదలకి స్టే ఇవ్వాలంటూ రమ్య రఘుపతి కోర్టుని కోరింది. ఈ విషయంలో కోర్ట్ నిర్ణయం తెలియాల్సి ఉంది.
Read Also: Malli Pelli Trailer: రంకు, ఉంచుకోవడంతో సహా మొత్తం చూపించేశారు

Exit mobile version