Naresh Comments on Love with Pavithra Lokesh: ఒకప్పటి స్టార్ హీరోయిన్ తర్వాత దర్శకురాలిగా రాణించిన విజయనిర్మల కొడుకు నరేష్ గతంలో కామెడీ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తండ్రి పాత్రలు చేస్తూ టాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తున్నాడు. అయితే నరేష్ ఎప్పుడూ పెళ్లిళ్ల విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. నరేష్ మూడు పెళ్లిళ్లు విడాకులతో ముగియగా ప్రస్తుతం పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నాడు. వీరి పెళ్లి అయిందో లేదో క్లారిటీ లేదు. మూడో భార్యతో విడాకులు పూర్తి కాకపోవడంతో పెళ్లి అయ్యే అవకాశం లేదు. ఆ సంగతి అలా ఉంచితే లేటు వయసులో వీరిద్దరూ ఎందుకు ప్రేమలో పడ్డారు అనే విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
Janhvi Kapoor: 13 ఏళ్లకే పోర్న్ సైట్లో ఫోటోలు… నా ఫ్రెండ్స్ కూడా చూశారు… జాన్వీ కపూర్ ఎమోషనల్
పవిత్ర ఆస్తి కోసమే నరేష్ ని ప్రేమించిందని ప్రచారం కూడా జరిగింది. అయితే తనకు పవిత్ర మీద ప్రేమ కలగడానికి గల కారణాన్ని నరేష్ తాజాగా వెల్లడించాడు. అదేమంటే తన తల్లి విజయనిర్మల పుట్టినరోజు పవిత్ర లోకేష్ పుట్టినరోజు ఒకటేనని ఇద్దరి పుట్టినరోజు ఫిబ్రవరి 20వ తేదీన అని నరేష్ పేర్కొన్నాడు. ప్రకృతి ఆ విధంగా తనకు సిగ్నల్ పంపిందని పవిత్ర లోకేష్ తో ప్రేమ గురించి ఆయన కామెంట్ చేశాడు. అత్తా కోడళ్ళ పుట్టిన రోజులు కలవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది, తన లైఫ్ లో మాత్రం ఈ మిరాకిల్ జరిగిందని చెప్పుకొచ్చాడు.
మా అమ్మ నీకు అన్నీ ఇచ్చాను కానీ మంచి పార్ట్నర్ ని ఇవ్వలేకపోయానని బాధపడుతూ ఉండేది, కానీ పవిత్ర లోకేష్ నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఆమె అనారోగ్యంతో చివరి దశలో బెడ్ మీద ఉన్నారు. అప్పుడు నా పార్ట్నర్ గురించి నువ్వు దిగులు పడొద్దు నా లైఫ్ లోకి ఒక మంచి వ్యక్తి వచ్చింది ధైర్యంగా ఉండమని మా అమ్మకి చెప్పానని నరేష్ చెప్పుకొచ్చాడు. పవిత్ర కూడా తన తల్లిలాగే చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని బహుశా అందుకే తనకు నచ్చి ఉండవచ్చేమోనని కామెంట్ చేశాడు నరేష్. నరేష్ జీవితంలో పవిత్ర నాలుగో వ్యక్తి కాగా పవిత్రకు కూడా గతంలోనే వివాహం జరిగింది. తన మొదటి భర్త నుంచి ఆమె దూరం జరిగింది.