మత్తు వదలరా, సేనాపతి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నరేష్ అగస్త్య మళ్లీ మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. మురళి కాట్రగడ్డ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతలు ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో “అసురగణ రుద్ర” అనే టైటిల్‌ను ప్రకటించారు. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ నటి సంగీత విపిన్ హీరోయిన్ గా కనిపించనుంది.
Read Also : Rahul Sipligunj : పబ్ లో అడ్డంగా దొరికిపోయిన బిగ్ బాస్ విన్నర్… పోలీసుల అదుపులో 150 మంది
ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలో నటిస్తున్న “అసురగణ రుద్ర” సినిమాలో మురళీ శర్మ, శతృ, అమిత్, ఆమని, దేవి ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమ్జుల ప్రొడక్షన్స్ పతాకంపై మురళీ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 6 నుండి ప్రారంభమవుతుంది. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో. మరి సినిమా ఎలా ఉంటుంది అన్నది చూడాలి.
