Nara Rohith : నారా రోహిత్ ప్రస్తుతం మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈయన.. మే నెలలో భైరవం మూవీతో వచ్చి మంచి టాక్ అందుకున్నాడు. ఇప్పుడు సుందరకాండ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇది రోహిత్ 20వ సినిమాగా రాబోతోంది. కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కిస్తుండగా.. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇందులో పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడాడు రోహిత్. పాలిటిక్స్ కూడా సినిమా లాంటివే అని.. సెకండ్ హాఫ్, క్లైమాక్స్ బాగుంటేనే సినిమాలు ఆడుతాయన్నారు రోహిత్.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ కు షాక్.. రోజుకు కోటిన్నర నష్టం..?
సినిమాల్లాగానే పాలిటిక్స్ కూడా ఐదేళ్లలో మిగతా నాలుగేళ్లు బాగుంటేనే రూలింగ్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. లేదంటే అంతే సంగతి అంటూ తెలిపాడు. మరి నారా రోహిత్ ను పెద్దగా ఎవరూ తిట్టరు కదా.. ఎందుకంటే రోహిత్ అందరి మనిషిలా కనిపిస్తాడు అని యాంకర్ ప్రశ్నించగా.. నా పేరు పక్కన ఇంటిపేరు ఉంది కదా అండి. దాంతోనే అంరదికీ ప్రాబ్లమ్ అంటూ నవ్వేశాడు రోహిత్. అంటే రోహిత్ పక్కన నారా అనేది ఉంది కాబట్టే అందరూ తనను మెచ్చుకోకపోవచ్చు అంటూ ఇన్ డైరెక్ట్ గా అన్నాడన్నమాట. మనకు తెలిసిందే కదా సీఎం నారా చంద్రబాబు తమ్ముడి కొడుకే రోహిత్ అని. రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లోనే గడుపుతున్నాడు రోహిత్. ప్రస్తుతం సుందరకాండ సినిమాకు వరుసగా ప్రమోషన్లు చేస్తూ బిజీగా ఉంటున్నాడు రోహిత్.
Read Also : Udaya Bhanu : అల్లు అర్జున్ తో చేసి.. పవన్ సినిమాకు నో.. ఉదయభానుపై ట్రోల్స్
