Nara RohitH : నారా రోహిత్ చాలా ఏళ్ల తర్వాత భైరవం మూవీతో వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. చాలా ఏళ్ల తర్వాత రోహిత్ ఇందులో మాస్ పర్ఫార్మెన్స్ తో అలరించాడు. ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో తన పెళ్లిపై కూడా స్పందించాడు. నారా రోహిత్ కు హీరోయిన్ సిరితో గతేడాది అక్టోబర్ లోనే ఎంగేజ్ మెంట్ జరిగింది. గత డిసెంబర్ లోనే పెళ్లి జరగాల్సి ఉన్నా.. నారా రోహిత్ తండ్రి అకాల మరణం చెందడంతో వాయిదా పడింది
Read Also : Sree Leela : ఎంగేజ్ మెంట్ ఫొటోలపై స్పందించిన శ్రీలీల..
రోహిత్ తండ్రి రామ్మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయంపై నారా రోహిత్ స్పందిస్తూ.. ఈ ఏడాది అక్టోబర్ లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. తన తండ్రి రామ్మూర్తి నాయుడు సంవత్సరికం అయిపోయిన తర్వాత తమ పెళ్లి ఉంటుందని చెప్పుకొచ్చాడు. హీరోయిన్ సిరితో నారా రోహిత్ కొంత కాలంగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. సిరి పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాతో తెరమీద కనిపించబోతోంది. ఆమె స్వస్థలం రెంటచింతల. తెలుగు అమ్మాయి. ఆస్ట్రేలియాలో చదువుకుంది. వీరిద్దరూ కలిసి ‘ప్రతినిధి2’ సినిమాలో నటించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది.
Read Also : Ameer Khan : సినిమాలకు అమీర్ ఖాన్ గుడ్ బై.. ఆ మూవీ తర్వాత..
