Site icon NTV Telugu

Nara Lokesh: బిగ్ బ్రేకింగ్.. కెజిఎఫ్ హీరో యష్ తో నారా లోకేష్ భేటీ

Yash

Yash

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా చంద్రబాబు నాయుడు వారసుడు నారా లోకేష్ తో కన్నడ స్టార్ హీరో యష్ భేటీ అయ్యాడు. నేడు హైదరాబాద్ కు వచ్చిన యష్ ను నారా లోకేష్ ను కలిసి ముచ్చటించాడు. ఒక హోటల్ లో యష్ ను చూసిన నారా లోకేష్.. తాను చందబ్రాబు నాయుడు కొడుకును అని పరిచయం చేసుకొని యష్ తో ముచ్చటించినట్లు తెలుస్తోంది. దీంతో యష్ సైతం గౌరవంగా నారా లోకేష్ తో మాట్లాడినట్లు సమాచారం. దాదాపు అరగంటసేపు వీరు మాట్లాడుకున్నారు. అయితే యష్ ను నారా లోకేష్ ఎందుకు మీట్ అయ్యాడో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం వీరి భేటీ అటు రాజీకీయాల్లోను, ఇటు ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ గా మారింది. ఇక యష్ కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం యష్ కొత్త కథలను విని మంచి కథలను ఎంచుకొనే పనిలో ఉన్నాడు. కెజిఎఫ్ బ్యానర్ లోనే యష్ తన తదుపరి సినిమా కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తోంది. ఏదిఏమైనా వీరి కలయిక ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version