Site icon NTV Telugu

Shyam Singha Roy: నాని మాస్టర్ పీస్‌కు వన్ ఇయర్

Shyam Singha Roy

Shyam Singha Roy

పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని పాన్ ఇండియా రేంజ్ కి తన మార్కెట్ ని స్ప్రెడ్ చెయ్యడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఈ ప్లాన్ ని సక్సస్ ఫుల్ గా ముందుకి తీసుకోని వెళ్లిన మొదటి సినిమా ‘శ్యాం సింగ రాయ్’. రాహుల్ సంకీర్త్యాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అన్ని సౌత్ లాంగ్వేజస్ లో రిలీజ్ అయ్యి నాని మార్కెట్ ని సౌత్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసింది. ఈ పీరియాడిక్ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రల్లో నటించాడు. అందులో ఒకటి ఫిల్మ్ రైటర్ ‘వాసు’ కాగా మరొకటి రెవల్యుషనరీ రైటర్ ‘శ్యాం సింగ రాయ్’. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే శ్యాం సింగ రాయ్ పాత్రలో నాని మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్ని రోజులు మనం చూసిన నాని ఇతనేనా అనిపించే రేంజులో ఫైట్స్ కూడా చేసి ఇంప్రెస్ చేశాడు.

Read Also: Big shock for Hero Nani: నానికి పెద్ద షాక్

శ్యాం సింగ రాయ్ సినిమాలో బిగ్గెస్ట్ ఎస్సెట్ హీరోయిన్ ‘సాయి పల్లవి’. దేవదాసీ ‘మైత్రేయి’గా, శ్యాం సింగ రాయ్ ప్రేమికురాలు ‘రోజీ’గా సాయి పల్లవి ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ ని కట్టి పడేస్తుంది. ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమె డాన్స్ మూవ్స్ కానీ, నానితో వర్కౌట్ అయిన కెమిస్ట్రీ కానీ థియేటర్ లో కూర్చోని సినిమా చూస్తున్న ఆడియన్స్ ని స్పెల్ బౌండ్ చేస్తాయి. ఈ మూవీలో మరో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి కూడా మోడరన్ లుక్ లో కొత్తగా కనిపించింది. ‘ఖబర్దార్’ అంటూ నాని చెప్పిన డైలాగ్స్, మిక్కీ జే మేయర్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సిరి వెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ‘సిరివెన్నెల’, ‘ప్రణవాలయా’ పాటలు శ్యాం సింగ రాయ్ సినిమాకి ప్రాణం పోశాయి. నాని, సాయి పల్లవి, డైరెక్టర్ రాహుల్, ప్రొడ్యూసర్స్ నిహారిక ఎంటర్టైన్మెంట్ ఫిల్మోగ్రఫీలో ‘శ్యాం సింగ రాయ్’ ఎప్పటికీ ఒక మాస్టర్ పీస్ గా నిలిచిపోతుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఏడాది అయిన సంధర్భంగా నాని ఫాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Read Also: Actor Nani: దసరాకు ధూమ్ ధామ్ చేస్తున్న హీరో నాని

Exit mobile version