Site icon NTV Telugu

Paradise : నాని ‘ప్యారడైజ్’ లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి

Paradise

Paradise

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా ‘హిట్: ది థర్డ్ కేస్’తో మంచి విజయం సాధించిన ఆయన, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత భారీగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై నాని తన పూర్తి దృష్టి పెట్టారు. ఈ చిత్రాన్ని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక ఈ ప్రాజెక్ట్‌పై అద్భుతమైన హైప్ నడుస్తున్న సమయంలో, మంచు లక్ష్మి ఓ పెద్ద అప్‌డేట్‌ను బయటపెట్టారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇది అధికారికంగా బయటకు వచ్చిందా తెలియదు. కానీ నేను చెప్పేస్తాను. నాన్నగారు (మోహన్ బాబు) కూడా ‘ది ప్యారడైజ్’లో కీలక పాత్ర చేస్తున్నారు. ఆ పాత్ర కోసం ఆయన ఈ వయసులోనూ చాలా కష్టపడుతున్నారు. ప్రతి సినిమాను తన మొదటి సినిమాలా ట్రీట్ చేసుకోవడం మా నాన్నగారి గొప్పతనం. ఆయన లుక్ కోసం ఎంత కష్టపడుతున్నారో చూసి నేనెంతో ఇన్‌స్పైర్ అయ్యాను” అని తెలిపారు. ఈ అప్డేట్ వెలుగులోకి రావడంతో నాని అభిమానులు, మోహన్ బాబు అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇంత వరకు రహస్యంగా ఉంచిన ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాని – మోహన్ బాబు కాంబినేషన్ స్క్రీన్‌పై ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది.

ఇక ‘ది ప్యారడైజ్’ ను ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్ కలబోతగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే, ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ఈ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్‌ను 2026, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే ఈ సినిమా బిజినెస్ రికార్డులు సెట్ చేస్తోందని సమాచారం.

Exit mobile version