పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ తో బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టొరీ సినిమాలు చేసి హిట్స్ హీరో నాని. చిరు, రవితేజల తర్వాత బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోగా పేరు తెచ్చుకున్న నాని, ఇప్పటివరకూ టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. ఈసారి మాత్రం టాలీవుడ్ నుంచి టోటల్ ఇండియా తన మార్కెట్ ని స్ప్రెడ్ చెయ్యాలి అనుకుంటున్నాడు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కంటెంట్ తో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో నాని పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. సింగరేణి నేపధ్యంలో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని ట్వీట్ చేశాడు. దసరా సినిమా కోసం గడ్డం పెంచి రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించిన నాని… గడ్డం తీసేసి క్లీన్ షేవ్ లోకి వచ్చేసాడు.
New day. New me 🙂#DasaraWrap pic.twitter.com/N5RnaTzoxV
— Nani (@NameisNani) January 12, 2023
దసరా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండగానే ప్రమోషన్స్ ని మొదలుపెట్టాడానికి రెడీ అయిన చిత్ర యూనిట్, ఇకపై బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వస్తుంది అని చెప్పారు. దసరా కంప్లీట్ అవ్వడంతో నాని, తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టాడు. నాని క్లీన్ షేవ్ లో కనిపించే కొత్త లుక్, ఇటివలే అనౌన్స్ చేసిన ఈ ప్రేమకథా చిత్రంలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అనౌన్స్మెంట్ తోనే అట్రాక్ట్ చేసిన ఈ ‘నాని 30’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనే విషయంపై చిత్ర యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే నాని దసరా షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నాడు. ఈ బ్రేక్ తర్వాత కొత్త హీరోయిన్, కొత్త దర్శకుడు, కొత్త ప్రొడ్యూసర్, కొత్త కథతో నాని నెక్స్ట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చెయ్యనున్నాడు.
