Site icon NTV Telugu

Nani 31: అంటే వివేక్ ఆత్రేయతో నానీ నెక్స్ట్…

Nani 31

Nani 31

మెంటల్ మదిలో సినిమాతో డెబ్యూ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు వివేక్ ఆత్రేయ. రెండో సినిమా బ్రోచేవారెవరురా ఆల్మోస్ట్ ఒక మోడరన్ క్లాసిక్ ని అందించాడు. ఇక మూడో సినిమా నానితో ‘అంటే సుందరానికి’ అంటూ చేసిన వివేక్ ఆత్రేయ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ని మెప్పించాడు కానీ ముందు రెండు సినిమాల్లాగా క్లీన్ హిట్ కొట్టలేకపోయాడు. కొంతమంది అంటే సుందరిని సినిమాని క్లాసిక్ అంటారు, ఇంకొంతమంది బాగోలేదు అంటారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా… అంటే సుందరానికి సినిమాలో నాని కామెడీ టైమింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్ మరోసారి సెట్ అయ్యింది. డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న నాని, నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ‘అంటే సుందరానికి’ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ… వివేక్ ఆత్రేయతో నాని సినిమాని అనౌన్స్ చేసాడు. చాలా రోజులుగా వినిపిస్తున్న ఈ కాంబినేషన్ ఈరోజు అఫీషియల్ గా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది.

డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నాని కెరీర్లో 31వ చిత్రంగా రాబోతుంది. #Nani31 ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ అనౌన్సమెంట్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాని కొత్త సరికొత్త లుక్‌లోకి రాబోతున్నట్టుగా చూపించారు. అక్టోబర్ 24న ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం… ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది. ఇంతకుముందు ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ లాంటి వెరైటీ టైటిల్స్ పెట్టిన వివేక్ ఆత్రేయ… నాని31 సినిమాకు కూడా డిఫరెంట్ టైటిల్ లాక్ చేశాడట. ఈ సినిమాకు ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఇక హీరోయిన్‌గా ప్రియాంకా అరుల్ మోహన్ ఫిక్స్ అయిందని సమాచారం. డివివి దానయ్య నిర్మిస్తున్న పవన్ ‘ఓజీ’ మూవీలో కూడా ఆమెనే హీరోయిన్. అందుకే.. నాని సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. గతంలో ఈ బ్యూటీ నాని ‘గ్యాంగ్ లీడర్‌’ సినిమాలోను నటించింది. మరి ఈసారైనా నాని, వివేక్ ఆత్రేయ్ హిట్ కొడతారేమో చూడాలి.

Exit mobile version