The Paradise: బట్టకాల్చి మీదేస్తే ఊరుకోం.. రీషూట్ పుకార్లపై మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా నాని హీరోగా నటిస్తున్న ‘ది పారడైజ్’ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. సినిమా అవుట్‌పుట్ అనుకున్న విధంగా రాలేదని, అందుకే చాలా వరకు ఇష్యూస్ చేస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా ఇలాంటి వార్తల మీద సినిమా యూనిట్ అధికారికంగా స్పందించింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారికి సీరియస్ వార్నింగ్ ఇస్తూ, అసలు వాస్తవాలను టీం బయటపెట్టింది.
“మా సినిమాను మొదటి రోజు ఎంత స్పష్టతతో ప్లాన్ చేశామో, ఇప్పుడు కూడా అంగుళం కూడా తేడా లేకుండా అదే పక్కా ప్రణాళికతో షూటింగ్ చేస్తున్నాం. ఇప్పటికే వంద రోజుల పాటు షూటింగ్ ఎంతో విజయవంతంగా పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న షెడ్యూల్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా, ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా కోసం ఏ ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేసే ప్రసక్తి లేదు. సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి నిరాధారమైన వార్తలను దయచేసి నమ్మకండి,” అని మేకర్స్ పేర్కొన్నారు.
Also Read
“ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా సరే మేము మా అధికారిక ఖాతాల ద్వారా వెల్లడిస్తాం. అలా వచ్చే అప్డేట్స్ మాత్రమే పరిగణనలోకి తీసుకోండి. ఇకమీదట మా ప్రాజెక్టు మీద కావాలని తప్పుడు ప్రచారాన్ని చేస్తే, ఆ వార్తలపై నేరుగా యాక్షన్ తీసుకుంటామని” వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
The Paradise: బట్టకాల్చి మీదేస్తే ఊరుకోం.. రీషూట్ పుకార్లపై మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్!
-
Bangladesh: ‘‘ముళ్ల కంచెలు మమ్మల్ని ఆపలేవు’’.. సువేందు ప్రకటనపై బంగ్లాదేశ్ ఆగ్రహం..
-
Campa Cola vs Coca-Cola: ‘కోలా వార్’లో కొత్త మలుపు.. అంబానీ ‘క్యాంపా’ దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..
-
CM Vijay: బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో.. విజయ్ పార్టీ వార్నింగ్..
-
Tamil Nadu: ఫ్లోర్ టెస్ట్‌కు ముందు కీలక పరిణామం.. రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
ట్రెండింగ్
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!