న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరును పెంచేసింది. నేడు హైదరాబాద్ లో నాని మీడియాతో ఇంటరాక్షన్ అయ్యాడు. ఇక ఈ సమావేశంలో నాని మరోసారి ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూపై ఫైర్ అయ్యాడు.. గతంలో ఈ విషయమై నానిని రాజకీయ నేతలు ఏకిపారేసిన విషయం విదితమే.. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని కీలక వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్ ను సినిమాలను అన్నింటినీ పక్కన పెడితే.. టికెట్ ధరలు తగ్గించడమనేది ప్రేక్షకులను అవమానించినట్లే అని మీడియా ముందే అనడం.. అవి కాస్తా వైరల్ కావడం జరిగిపోయాయి.
ఇక నాని అన్న మాటలకు రాజకీయ నాయకులు తమదైన రీతిలో స్పందించారు కూడా.. ఇక ఇలా జరుగుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను మార్చుకొనే విధానం ప్రవేశపెట్టింది. ఇక ఇప్పుడు ఆ టికెట్ రేట్లు పెంచడమే తప్పు అయిపోయింది అనేది పలువురు వాదన.. ఈ టికెట్ రేట్స్ హైక్ వలనే కొన్ని సినిమాలు హిట్ టాక్ ను తెచ్చుకోలేకపోయాయని అభిమానులు బాహాటంగానే అంటున్నారు. ఇక దీంతో ఇప్పుడు మేకర్స్ తగ్గింపు టికెట్ ధరలతో తీసుకొస్తున్నాం.. మా సినిమా చూడండి అని చెప్పుకొంటున్నారు. ఇదే తరహాలో నాని సినిమా వస్తుంది .. మరి ఇప్పుడు ప్రేక్షకులను అవమానించినట్లుకాదా అని విమర్శిస్తున్నారు. ఈ విషయమై నాని తాజాగా స్పందించాడు.. ” నన్ను విమర్శించేవాళ్ళు అందరు తెలివితక్కువ వాళ్లు.. నేనేమి టికెట్ ధరను రూ 500 పెంచమని అడగలేదు.. కానీ ఇలా 20, 40, 60 లతో సినిమా ఇండస్ట్రీ మనుగడ సాధించలేదని మాత్రమే చెప్పాను.. అప్పుడు అది తప్పు అయితే.. ఇప్పుడు ఇది కూడా తప్పే” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
