NTV Telugu Site icon

Nani: దసరాను కెజిఎఫ్ తో పోల్చినవారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాని

Nani

Nani

Nani: న్యాచురల్ స్టార్ నాని.. కొత్త డైరెక్టర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ హిట్ కొట్టడం ఈ హీరోకు వెన్నతో పెట్టిన విద్య. ఇక దసరా సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు శ్రీకాంత్ ఓడేల. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దసరా సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో నాని ప్రమోషన్స్ షురూ చేశాడు. పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని రాష్ట్రాలు తిరుగుతూ అభిమానులకు దగ్గర అవుతున్నాడు. మరో పక్క సోషల్ మీడియాలో సైతం అభిమానులను ఉత్సాహపరుస్తున్నాడు. ఇక తాజాగా నాని మొదటిసారి అభిమానులతో చిట్ చాట్ సెషన్ చేశాడు. #AskNani అంటూ దసరా గురించిన అన్ని విషయాలను అడగొచ్చని చెప్పడంతో అభిమానులు తమ అనుమానాలను ఏకరువు పెట్టారు.

Ravanasura: ‘ఇడియట్’ రవితేజ గుర్తొచ్చాడు బ్రో..

ఇక ఒక అభిమాని.. “పుష్ప మరియు రంగస్థలం కంటే దసరా ఎలా భిన్నంగా ఉంటుంది?.. నార్త్ ఆడియెన్స్ చాలామంది దసరా ట్రైలర్ చూసి కెజిఎఫ్ లా ఉందని విమర్శిస్తున్నారు. దయచేసి వారి అపోహను తొలగించండి” అని ప్రశ్నించాడు. అందుకు నాని.. నార్త్ ఆడియెన్స్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. “షారుఖ్ ఖాన్, ఆర్నాల్డ్ ఇద్దరు ఒకేలాంటి లెదర్ జాకెట్ వేసుకున్నంత మాత్రానా టెర్మినేటర్, దిల్ వాలే దుల్హానియే లేజాయాంగే రెండు ఒకటి కాదు” అంటూ చెప్పుకొచ్చాడు. అంటే కెజిఎఫ్, దసరా రెండు ఒకటి కాదు అని ఒక్క మాటలో తేల్చేశాడు నాని. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి దసరా సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments