Site icon NTV Telugu

నాకు నేనే డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుంది.. అందుకే చెప్పను – నాని

nani

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ జోరును పెంచేసిన మేకర్స్ ఈరోజు శిల్ప కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ” సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాం. ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ వరంగల్ ఈవెంట్ లోనే థాంక్స్ చెప్పాను.. మరోసారి ఈ సినిమాకు పనిచేసిన వారందరూ వారి స్టామినాకు తగ్గట్టుగా పనిచేశారు.

సాయి పల్లవి ఈ ఈవెంట్ లో ఎందుకు ఇంత ఎమోషనల్ అయ్యింది సినిమా చూసాకా మీకే తెలుస్తోంది. ఇక రాహుల్ గురించి చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన కథను అందించాడు. రాహుల్ గురించి ఐదు రోజుల రిలీజ్ ముందు నేను ఎంత మెచ్చుకుంటే.. నా సొంత డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుంది.. అతని తరపున ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. డిసెంబర్ 24 న అది అందరికి తెలుస్తోంది. ఇలాంటి ఒక సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని బ్లేస్ చేయడానికి వచ్చిన అభిమానులందరికి థాంక్స్ .. క్రిస్టమస్ మనదే.. అంటూ ముగించారు.. ఇక చివర్లో మడోనా పేరు చెప్పడం మర్చిపోయానని చెప్పిన నాని మడోనా గురించి చెప్తూ మంచి పాత్ర చేసిందని, అలాంటి రోల్ ఏ హీరోయిన్ ఒప్పుకోదని, కానీ తానూ ఒప్పుకోవడం గ్రేట్ అంటూ ముగించారు.

Exit mobile version