NTV Telugu Site icon

Nani: బ్రదర్.. కొద్దిగా ఓవర్ గా అనిపించలేదా

Nani

Nani

Nani: సాధారణంగా సినిమా తీసిన ప్రతి ఒక్క హీరో తమ సినిమా గురించి గొప్పగా చెప్పుకొస్తారు. తమ సినిమా సూపర్ అని బంపర్ అని.. తమ సినిమా మీద తమకు కాన్ఫిడెంట్ ఉండడం ఓకే.. కానీ ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం మంచిది కాదు అంటున్నారు అభిమానులు. లైగర్ సినిమానే ఉదాహరణగా తీసుకొంటే. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్.. ఈ సినిమాకు ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు. బాలీవుడ్ కాదు.. మొత్తం సినీ ఇండస్ట్రీలోనే లైగర్ రికార్డులు సృష్టిస్తుంది అని రచ్చ రచ్చ చేశారు. కానీ, అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి అనేలా బాక్సాఫీస్ వద్ద లైగర్ బోల్తా పడింది. ఇక పెద్ద సినిమాలు ఎప్పుడు వస్తున్నా అభిమానులు కొద్దిగా భయపడుతూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం నాని నటించిన దసరా సినిమాపై కూడా అదే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం.. నేడు దసరా టీజర్ ఈవెంట్ లో నాని చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడడమే.

సినిమా చాలా బాగా వచ్చింది అని చెప్పిన నాని మార్చి 30 న ప్రతి ఒక్కరు దసరా గురించే మాట్లాడుకొంటారని చెప్పాడు. ఓడెల శ్రీకాంత్ పేరు గుర్తిండి పోతుందని చెప్పాడు. ఇక ఆ తరువాత.. 2022 లో ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, కాంతారను ఎలా గుర్తుపెట్టుకున్నారో.. 2023లో దసరాను అలాగే గుర్తుపెట్టుకుంటారు అని చెప్పుకొచ్చాడు. పాన్ ఇండియా సినిమాలు అంటే అవే అని.. ఆ సినిమాలలానే దసరా కూడా అంతటి విజయం అందుకుంటుంది అని చెప్పడం బాగానే ఉన్నా.. వాటితో పోలుస్తూ చెప్పడం అంటే కొద్దిగా ఓవర్ గా అనిపిస్తోంది బ్రో అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. సినిమా హిట్ అయితేపర్లేదు .. ఒకవేళ ఒక మోస్తరు టాక్ వచ్చినా ట్రోలర్స్ ఏకిపారేస్తారు అని చెప్పుకొస్తున్నారు. మరి నాని కాన్ఫిడెన్స్ ను దసరా నిలబెడుతుందో లేదో చూడాలంటే మార్చి 30 వరకు ఆగాల్సిందే.

Show comments