Site icon NTV Telugu

లయన్ లా ఉన్నావ్ నాన్న.. జున్నుతో నాని వీడియో వైరల్

nani

nani

చిత్ర పరిశ్రమకు ఈ డిసెంబర్ గట్టిగానే కలిసొచ్చింది చెప్పాలి. ఈ నెలలో అఖండ, పుష్ప భారీ అంచనాల నడుమ విడుదలై భారీ విజయాలను అందుకొన్నాయి. ఇక ఈ క్రిస్టమస్ కి నేను ఉన్నాను అంటూ అడుగుపెట్టబోతోంది శ్యామ్ సింగరాయ్. న్యాచురల్ స్టార్ నాని- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24 న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇక నాని ఈ సినిమా కోసం ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు.

https://ntvtelugu.com/will-pawan-kalyan-be-successful-this-time/

ఇంట్లో తన ముద్దుల కొడుకు జున్నుతో ఆడుకుంటున్నప్పుడు కూడా శ్యామ్ సింగరాయ్ స్టైల్ ని మాత్రం వదలలేదు. తాజాగా నాని ఇన్స్టాగ్రామ్ లో జున్నుతో గడిపే మధురమైన క్షణాలను షేర్ చేశారు. జున్నునాని గుండెల మీద కూర్చొని ఉండగా “నా పేరేంటో తెలుసా అని నాని అడగగా.. జున్ను శ్యామ్ సింగరాయ్ అని చెప్పాడు.. ఇక నాన్న మీసాలు మెలేస్తూ జున్ను ఇలా ఉంటే లయన్ లా ఉన్నావ్ నాన్న అని అనగానే నాని అవునా అంటూ కొడుకు ముద్దు ముద్దు మాటలకు మురిసిపోయాడు. ఇక ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నాని, తనకొడుకు జున్ను క్యూట్ వీడియోస్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకొంటూ ఉంటాడు. అంతకుముందు ఈ తండ్రికొడుకులిద్దరూ చేసిన అల్లరి వీడియోలు ఎంత సందడి చేశాయో తెలిసిందే.

https://www.instagram.com/p/CXsQCIwgYUi/

Exit mobile version