NTV Telugu Site icon

Nani: సక్సెస్ వస్తే నా పేరు చెప్పి.. ఫెయిల్యూర్ అయితే డైరెక్టర్ పేరు చెప్పను

Nani

Nani

Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక తన సినిమా ప్రమోషన్స్ లో నాని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. దాని వలన కొన్ని విమర్శలు కూడా అందుకున్నాడు. తనకు అనిపించినా అభిప్రాయం చెప్పానే కానీ, ఒకరిని తక్కువ చేసి ఎక్కువ చేసి మాట్లాడలేదని నాని ఎప్పటికప్పుడు చెప్పుకొస్తూనే ఉంటాడు. ఇక తాజాగా దసరా ప్రమోషన్స్ లో కూడా నాని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. సాధారణంగా నాని తన సక్సెస్ ను యాక్సప్ట్ చేస్తాడు కానీ ఫెయిల్యూర్ ను మాత్రం ఎప్పటికీ యాక్సప్ట్ చేయడు అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అదే విషయమై నాని తనదైన శైలిలో సమాధానం చెప్పి షాక్ ఇచ్చాడు.

Rana Naidu: బూతులు ఉన్నాయంటారు.. అయినా ట్రెండింగ్ లో ఉంచేస్తారు

నాని కెరీర్ లో కొన్ని ప్లాప్స్ ఉన్నాయి.. అందులో టక్ జగదీశ్, వి లాంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలు రెండు పరాజయాన్ని చవిచూశాయి. కానీ, నాని మాత్రం ఈ రెండు సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించితిన్, వీక్షించిన సినిమాలు అని నాని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. అంటే నాని ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయలేడా? అని తాజా ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఎదురయ్యింది. దానికి నాని సమాధానం చెప్తూ.. ” నా సైడ్ నిజం మీకు తెలియనప్పుడు మీరెలా దీన్నీ నిజం అనుకుంటారు. నాని ఎందుకు ఫెయిల్యూర్ ను కూడా డిఫెండ్ చేస్తాడు అని అడుగుతున్నారు కదా.. నేను ఎందుకు డిఫెండ్ చేస్తాను.. దాని రక్షించాలని నేను ఎందుకు చూస్తాను.. అది ఫెయిల్యూర్ అయిపోయింది.. దానివలన జరిగిన నష్టం నాకు జరిగిపోయి ఉంటుంది.

Oscar For Naatu Naatu: ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్.. ఉపేంద్ర ఏం అన్నాడంటే..

ఫెయిల్యూర్ ను డిఫెండ్ చేయడం వలన నాకు జరిగే కొత్త ప్లస్ ఏం లేదు. దీన్ని నేను ఎలా చూస్తాను అంటే.. ఫెయిల్యూర్ అవ్వగానే ఇది నాది కాదు అని వదిలేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సక్సెస్ అయిన సినిమాకు మాత్రమే వచ్చిన క్రెడిట్ నాది అని చెప్పుకొనేవారు చాలామంది ఉంటారు. నేను ఫెయిల్యూర్ అయిన సినిమాను కూడా వదలను అది నాదే ఇక డిఫెండ్ చేయడం అంటే.. టక్ జగదీశ్ నా కెరీర్ లోనే ఎక్కువమంది చూసిన సినిమా. అది అమెజానే చెప్పింది. టీఆర్పీ అందరికి కనిపిస్తోంది. అదే నేను చెప్పాను. అందులో డిఫెండ్ చేసుకోవడం ఎక్కడుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments