NTV Telugu Site icon

Nani: జైపూర్ లో ‘ధరణి’ హంగామా… రాజమౌళి హీరోల తర్వాత నానీనే

Nani

Nani

నేచురల్ స్టార్ గా పక్కింటి కుర్రాడి ఇమేజ్ ని ఇన్ని రోజులు మైంటైన్ చేసిన నాని, మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా దసరా. శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా సినిమా చేస్తే సరిపోదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ కూడా చెయ్యాలి అని అర్ధం చేసుకున్న నాని దసరా సినిమా కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నాడు. జస్ట్ నార్త్ మీడియాకి ఇంటర్వ్యూస్ ఇచ్చేసి వచ్చేయకుండా నాని నార్త్ లోని అన్ని మేజర్ ప్రాంతాలకి వెళ్లి మరీ దసరా సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. అవకాశం ఉన్న ప్రతి చోటా కనిపిస్తున్న నాని ప్రస్తుతం జైపూర్ లో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో రాజమౌళి హీరో కాకుండా మరో హీరో తన సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత తిరగడం జరగలేదు.

సౌత్ లో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నాని కాస్త తక్కువగా తిరుగుతున్నాడు కానీ నార్త్ లో మాత్రం ఒక హీరో తన సినిమా ప్రమోషన్స్ కి చెయ్యల్సినదంతా చేస్తున్నాడు. రూటెడ్ కథలకి నార్త్ లో మంచి రీచ్ ఉంది సరిగ్గా ప్లాన్ చేసి ప్రమోషన్ చేస్తే వంద కోట్ల మార్కెట్ ని బ్రేక్ చెయ్యడం పెద్ద  కష్టమేమి కాదు. పుష్ప తరహాలోనే నార్త్ ఆడియన్స్ కి రీచ్ అయితే దసరా సినిమా కూడా వంద కోట్లు రావడం పెద్ద కష్టమేమి కాదు. సాలిడ్ బజ్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, టెర్రిఫిక్ పెర్ఫర్మర్స్ ఉన్నారు… ఇంత బ్యాక్ ఉంది కాబట్టి కథలో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటే చాలు దసరా సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడం గ్యారెంటీ. మరి దసరా మూవీ మార్చ్ 30న నాని కష్టానికి తగ్గ రిజల్ట్ ని పాన్ ఇండియా రెంజులో ఇస్తుందేమో చూడాలి.

Show comments