Nani: జైపూర్ లో ‘ధరణి’ హంగామా… రాజమౌళి హీరోల తర్వాత నానీనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ గా పక్కింటి కుర్రాడి ఇమేజ్ ని ఇన్ని రోజులు మైంటైన్ చేసిన నాని, మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా దసరా. శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా సినిమా చేస్తే సరిపోదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ కూడా చెయ్యాలి అని అర్ధం చేసుకున్న నాని దసరా సినిమా కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నాడు. జస్ట్ నార్త్ మీడియాకి ఇంటర్వ్యూస్ ఇచ్చేసి వచ్చేయకుండా నాని నార్త్ లోని అన్ని మేజర్ ప్రాంతాలకి వెళ్లి మరీ దసరా సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. అవకాశం ఉన్న ప్రతి చోటా కనిపిస్తున్న నాని ప్రస్తుతం జైపూర్ లో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో రాజమౌళి హీరో కాకుండా మరో హీరో తన సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత తిరగడం జరగలేదు.
సౌత్ లో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నాని కాస్త తక్కువగా తిరుగుతున్నాడు కానీ నార్త్ లో మాత్రం ఒక హీరో తన సినిమా ప్రమోషన్స్ కి చెయ్యల్సినదంతా చేస్తున్నాడు. రూటెడ్ కథలకి నార్త్ లో మంచి రీచ్ ఉంది సరిగ్గా ప్లాన్ చేసి ప్రమోషన్ చేస్తే వంద కోట్ల మార్కెట్ ని బ్రేక్ చెయ్యడం పెద్ద కష్టమేమి కాదు. పుష్ప తరహాలోనే నార్త్ ఆడియన్స్ కి రీచ్ అయితే దసరా సినిమా కూడా వంద కోట్లు రావడం పెద్ద కష్టమేమి కాదు. సాలిడ్ బజ్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, టెర్రిఫిక్ పెర్ఫర్మర్స్ ఉన్నారు… ఇంత బ్యాక్ ఉంది కాబట్టి కథలో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటే చాలు దసరా సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడం గ్యారెంటీ. మరి దసరా మూవీ మార్చ్ 30న నాని కష్టానికి తగ్గ రిజల్ట్ ని పాన్ ఇండియా రెంజులో ఇస్తుందేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!