Site icon NTV Telugu

Hi Nanna Trailer: ఏడిపించేలా హాయ్ నాన్న ట్రైలర్… చూశారా?

Hi Nanna Official Trailer

Hi Nanna Official Trailer

Nani Mrunal Thakur Hi Nanna Trailer Released: టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని న‌టిస్తున్న హాయ్‌ నాన్న, ఈ సినిమాతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా తెలుగు పరిశ్రమకు ప‌రిచ‌యం అవుతున్నాడు. టాలీవుడ్ భామ సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫ‌స్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌ల్స్ రిలీజ్ లాంఛ్ చేయగా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రాణంగా పెంచుకుంటున్న కూతురికి తల్లి లేని లోటును తెలియకుండా ఇచ్చే ఒక నాన్న కధలా ఈ ట్రైల‌ర్ గ‌మ‌నిస్తే అనిపిస్తోంది. తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న‌ ఈ హాయ్‌ నాన్న సినిమాలో బేబీ కియారా, మృణాల్ ఠాకూర్, జయరాం, శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో కనిపించనుండ‌గా.. డిసెంబర్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Keerthy Suresh: ఇంత సైలెంటుగానా… ఇదేంటి అక్క?

ఇక ట్రైలర్ గమనిస్తే ఈ సినిమాలో విరాజ్ పాత్రలో నాని, యష్న క్యారెక్టర్‌లో మృణాల్, నాని కూతురు మహీ పాత్రలో బేబి కియారా నటించారు. కూతురికి నాని కథ చెబుతున్నట్టుగా ట్రైలర్ మొదలు కాగా తన అమ్మ కథ చెప్పాలని చిన్నారి అడుగుతూ ఉండగా నాని దాటవేస్తూ ఉంటాడు. ఓ ప్రమాదం నుంచి మహీని కాపాడి మృణాల్ ఠాకూర్ ఆమెకు దగ్గరైంది. అయితే చివరికి అమ్మ కథ చెబుతానని తన కూతురితో నాని మొదలు పెట్టి తన లవ్ స్టోరీ, పెళ్లి తర్వాత గొడవలు పడి భార్యతో విడిపోయినట్టుగా చెబుతున్నట్టు కనిపిస్తోంది. నా ప్రేమ సరిపోవడం లేదా మహీ అని ఎమోషనల్‍గా నాని డైలాగ్ చెబితే, ఇంకా చెప్పొద్దు ఇంటికి వెళ్లిపోదాం నాన్న అని కియారా అతడిని హత్తుకుంటుండం కన్నీరు తెప్పిస్తోంది. 2 నిమిషాల 40 సెకన్ల పాటు ఉన్న హాయ్ నాన్న ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

Exit mobile version