విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ యంగ్ స్టర్ వెంకీ మామని యాక్షన్ మోడ్ లో చూపించబోతున్నాడు. 2024 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ సైంధవ్ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన శైలేష్ కొలను… ఒక ఇంటర్వ్యూలో హిట్ 3 సినిమా గురించి మాట్లాడుతూ నాని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. ‘హిట్ ఫ్రాంచైజ్’లో ఇప్పటికే హిట్ 1 అండ్ హిట్ 2 సినిమాలు వచ్చాయి. పార్ట్ 1లో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తే పార్ట్ 2లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఈ ఇద్దరూ హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ గా సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. హిట్ 2 ఎండ్ లో హిట్ 3 సినిమాకి లీడ్ ఇస్తూ నానిని రివీల్ చేసాడు శైలేష్ కొలను. అర్జున్ సర్కార్ గా నాని కనిపించనున్న హిట్ 3 మూవీకి ఒక స్పెషల్ గ్లిమ్ప్స్ ని కట్ చేసి హిట్ 2 ఎండ్ లో చూపించారు. HIT టీమ్ లోనే మోస్ట్ వైల్డ్ ఆఫీసర్ గా నాని కనిపించనున్నాడు అని తెలియగానే నాని ఫ్యాన్స్ అంతా హిట్ 3 కోసం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ వెయిటింగ్ ని మరింత పెంచుతూ హిట్ 3 సినిమా ఇప్పట్లో స్టార్ట్ అవ్వదు అని చెప్పేసాడు శైలేష్ కొలను. బ్యాక్ టు బ్యాక్ హిట్ ఫ్రాంచైజ్ నుంచి సినిమాలు వస్తే… ఆడియన్స్ లో మొనాటని వచ్చేస్తుంది. హిట్ సినిమాలు చాలా రెగ్యులర్ అయిపోతాయి, ఆడియన్స్ ని క్యూరియాసిటీలో ఉంచాలి అంటే కాస్త గ్యాప్ ఇవ్వాలి… సైంధవ్ లాగే నెక్స్ట్ కూడా ఒక స్టాండ్ అలోన్ సినిమా చేస్తున్నాను. అది కంప్లీట్ అయిన తర్వాత హిట్ 3 గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు శైలేష్ కొలను. నానికి కూడా ప్రస్తుతం మంచి లైనప్ ఉంది. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా, సరిపోదా శనివారం, గౌతమ్ తిన్నునూరి లాంటి దర్శకులతో నాని సినిమాలు చేయాల్సి ఉంది. ఈ సినిమాలు కంప్లీట్ అయ్యాక లేదా మధ్యలో లైనప్ ని అడ్జస్ట్ చేసో నాని హిట్ 3ని చేసే అవకాశం ఉంది. అప్పటివరకూ హిట్ 3 ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉన్నట్లే.