NTV Telugu Site icon

Hi Nanna Samayama Song: ఈ సాంగ్ ని లూప్ మోడ్ లో పెట్టాల్సిందే…

Hi Nanna

Hi Nanna

దసరా సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిన నాని… ఈసారి ప్రేమకథతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు శౌరవ్ ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఇప్పటికే గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. లాంగ్ హెయిర్, క్లీన్ షేవ్ లో నాని ఉబెర్ కూల్ గా కనిపించాడు. మృణాల్-నానిల పెయిర్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ జంటగా కనిపిస్తున్నారు. గ్లిమ్ప్స్ చివరలో మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ బిట్ సాంగ్ రిపీట్ మోడ్ లో వినేలా ఉంది.

ఇప్పుడు ఇదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ… హాయ్ నాన్న సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ‘సమయమా’ అంటూ సాగిన ఈ సాంగ్ ని అనంత శ్రీరామ్ బ్యూటిఫుల్ లిరిక్స్ తో నింపేసాడు. హేషమ్ సోల్ ఫుల్ ట్యూన్ కి అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ కి అనురాగ్ కులకర్ణి, సితార వోకల్స్ తో ప్రాణం పోశారు. స్లో పాయిజన్ లా కాకుండా వినగానే ఎక్కేసి, లూప్ మోడ్ లో రిపీట్స్ వేయాలనిపించేలా ఈ సాంగ్ ఉంది. హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ కి పర్ఫెక్ట్ స్టార్ట్ ఇచ్చిన ఈ సాంగ్ చాలా రోజుల పాటు వినిపించడం గ్యారెంటీ. లిరికల్ వీడియో మధ్యలో అక్కడక్కడా చూపించిన విజువల్స్ లో నాని-మృణాల్ పెయిర్ చాలా క్యూట్ గా ఉంది. ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్న ఈ పెయిర్ ఆడియన్స్ థియేటర్స్ లో ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.