NTV Telugu Site icon

Hi Nanna: స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపొయింది… మంచి ప్రేమ కథ చూసేయండి

Hi Nanna

Hi Nanna

ఒక పక్క అనిమల్ సినిమా ర్యాంపేజ్, ఇంకోపక్క డిసెంబర్ డ్రై సీజన్… అనిమల్ సినిమా ముందు అసలు ఏ సినిమా కనిపించదేమో అనుకుంటున్న సమయంలో నాని ‘హాయ్ నాన్న’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఇంత సైలెంట్ లవ్ స్టోరీ, అసలు హైప్ లేదు నాని రిస్క్ చేస్తున్నాడా అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ మాటల్ని లెక్క చేయకుండా నాని కథపై ఉన్న నమ్మకంతో హాయ్ నాన్న సినిమాని రిలీజ్ చేసాడు. అందరి అంచనాలని తలకిందులు చేస్తూ హాయ్ నాన్న రెండో రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ రాబట్టింది. హాయ్ నాన్న మూవీ కూడా పైకి తండ్రి కూతురి ఎమోషన్ గా కనిపించినా సినిమా మొత్తాన్ని నడిపించింది మాత్రం హీరో-హీరోయిన్ మధ్య ఉండే లవ్ ఎమోషన్. నాని-మృణాల్ తన యాక్టింగ్ స్కిల్స్ తో తెరపై మ్యాజిక్ చేసి చూపించారు.

సింపుల్ సీన్స్ ని కూడా అద్భుతంగా మార్చేసింది లీడ్ పెయిర్ యాక్టింగ్. ఈ కారణంగానే హాయ్ నాన్నకి హిట్ టాక్ వచ్చింది, మౌత్ టాక్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవ్వడం కలెక్షన్స్ కి మరింత హెల్ప్ అయ్యింది. టాక్ బాగుండడంతో వీక్ డేస్ లోనే కాదు వర్కింగ్ డేస్ లో హాయ్ నాన్న సినిమా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా హాయ్ నాన్న సినిమా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాదాపు 70 కోట్లకుపై పైగా కలెక్ట్ చేసిన హాయ్ నాన్న మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ లో హాయ్ నాన్న సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మంచి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా కాబట్టి థియేటర్స్ లో చూసిన వాళ్లు కూడా హాయ్ నాన్న సినిమాని ఓటీటీలో చూడడం గ్యారెంటీ.