నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ “అంటే సుందరానికి” టీజర్ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటించింది. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నరేష్, రోహిణి, నదియా, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అంటే సుందరానికి’ మూవీ జూన్ 10న తెలుగు, తమిళం, మలయాళంలో థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ ను కూడా ఈ మూడు భాషల్లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ మూవీని సౌత్ లో మాత్రమే, అదికూడా మూడు భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. టీజర్ రిలీజ్ ఈవెంట్లో కన్నడ భాషలో సినిమాను ఎందుకు డబ్ చెయ్యట్లేదు ? అనే ప్రశ్న నానికి ఎదురైంది.
Read Also : Mahesh Babu : హ్యాపీ బర్త్ డే అమ్మా… లవ్ యూ ఆల్వేస్ !
ఈ ప్రశ్నకు స్పందించిన నాని “ఫిల్మ్ మేకర్స్, టెక్నిషియన్స్ సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి సినిమా రీచ్ అవ్వాలని కోరుకుంటారు. అందుకే వేరే వేరే భాషల్లో సినిమాలు చేయడానికి అదే కారణం. మన తెలుగు భాష అందరికీ రీచ్ అవ్వదు. అందుకనే వాళ్ళ భాషల్లో డబ్ చేస్తాము. కానీ మనోళ్లు బలమైన కోరిక ఏమిటంటే… ఒరిజినల్ భాషలోనే అందరూ సినిమా చూడాలని. కానీ అది అన్నిచోట్లా ఇది కుదరదు. ఒక్క కన్నడ విషయంలోనే అది కుదురుతుంది. కన్నడ ప్రేక్షకులు తెలుగు సినిమాలను బాగా చూస్తారు. తెలుగు సినిమాలను అర్థం చేసుకుంటారు. కాబట్టి వాళ్లకు ఒరిజినల్ సినిమానే చూపించాలని అనుకున్నాము” అంటూ చెప్పుకొచ్చారు.