NTV Telugu Site icon

Dasara: నాని కోసం వెయిట్ చేస్తుంటే నాగ శౌర్య వచ్చాడు…

Dasara

Dasara

ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ హీరో నానితో ‘దసరా’ సినిమా చేస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. పాన్ ఇండియా సినిమా అంటే పాన్ ఇండియా రేంజులోనే ప్రమోషన్స్ ఉండాలి, ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్ మర్చిపోయారో లేక ఇంకా టైం ఉంది కదా అనుకుంటున్నారో తెలియదు కానీ నాని ఫాన్స్ మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. దసరా మూవీకి సరిగ్గా ప్రమోషన్స్ చెయ్యట్లేదు అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎస్.ఎల్.వి సినిమాస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ ఒక నోటిఫికేషన్ వస్తే అందరూ అది ‘దసరా’ సినిమాకి సంబంధించిన నోటిఫికేషన్ అయ్యి ఉంటుంది, ప్రొడ్యూసర్ ఏదైనా అప్డేట్ ఇచ్చాడేమో అని ఆశతో ట్విట్టర్ ఓపెన్ చేశారు.

Read Also: Micheal: పాన్ ఇండియా సినిమా ట్రైలర్ లాంచ్ చెయ్యనున్న బాలయ్య

అందరికీ షాక్ ఇస్తూ… నాని సినిమా అప్డేట్ కాకుండా నాగ శౌర్య సినిమా అప్డేట్ ఇచ్చారు ప్రొడ్యూసర్స్. ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్ 6 సినిమాలో నాగ శౌర్య హీరోగా నటిస్తున్నాడు. నాగ శౌర్య బర్త్ డే కావడంతో మేకర్స్, ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. పవన్ బాసంశెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అప్డేట్ బయటకి వచ్చి నాగ శౌర్య అభిమానులని ఖుషీ చేసింది కానీ నాని అభిమానులు మాత్రం బాగా డిజ ప్పాయింట్ అయ్యి సోషల్ మీడియాలో ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ ని ట్యాగ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు.