Nani eyeing on Out and out Mass Movies: కెరీర్ మొదటి నుంచి హీరో నాని ఎక్కువ లవ్ స్టోరీలు చేస్తూ వచ్చాడు. దీంతో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి ముఖ్యంగా లేడీస్ కి బాగా దగ్గరయిపోయాడు. అయితే ఎక్కువగా అవే సినిమాలు చేస్తూ రావడంతో ఒకానొక దశలో ఆయన అభిమానులకు మొహం మొత్తేసిందో ఏమో కొన్ని సినిమాలు అంతగా ఆదరించలేదు. ఈ దెబ్బకు పంథా మార్చుకుని దసరా అనే సినిమా చేయగా అది సూపర్ హిట్ అయింది. ఇక ప్రస్తుతానికి ఆయన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హాయ్ నాన్న అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా సాఫ్ట్ లవ్ స్టోరీ అని అంటున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆలోచనలో పడిన నాని మాస్ సినిమాల మీద కన్నేసినట్టు తెలుస్తోంది. నిజానికి నాని ఎప్పుడూ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోలేదు అయితే ముందు నుంచే అప్పుడప్పుడు లైట్ గా మాస్ సినిమాలు చేస్తూ.. హ్యాపీగా పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో బండి నడిపిస్తున్నారు.
People Media factory: చిరుతో సినిమా లేదు.. ఉంటే మాకన్నా ఆనందపడే వాళ్ళు లేరు!
అయితే నాని లైఫ్ దసరా ముందు దసరా తర్వాత అన్నట్టు మారిపోయింది. ఆ సినిమా దెబ్బకు మాస్ ఇమేజ్‌పై బాగా మనసు పడ్డ న్యాచురల్ స్టార్ ఇక మీదట కూడా అలాంటి కథలు కావాలని ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం హాయ్ నాన్న అంటూ ఎమోషనల్ సినిమా చేస్తున్నా ఆ తర్వాత నాని లైనప్ మాత్రం మాసీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. నాని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అలాంటి కథల కోసం జల్లెడ పట్టాలని తనతో సినిమాలు చేయాలని చూస్తున్న నిర్మాతలను కోరుతున్నాడు. అంటే సుందరానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా నాని కోసం యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు.
