Site icon NTV Telugu

Nani: షూటింగ్ లో హీరో నానికి యాక్సిడెంట్?

Nani Accident Eye Infection

Nani Accident Eye Infection

Nani eye injured while shooting action episodes for Saripodha Sanivaram: ఎక్కడో కృష్ణా జిల్లాలో పుట్టిపెరిగి నటన మీద ఆసక్తితో దర్శకత్వ శాఖలో పని చేస్తూ ఆర్జేగా మారి చివరికి అష్టాచెమ్మా అనే సినిమాతో హీరోగా మారాడు ఘంటా నవీన్ కుమార్ అలియాస్ నాని. పక్కింటి కుర్రాడిలా అందరికీ నాని అని పరిచయం అయిన నవీన్ కుమార్ ఇప్పుడు తెలుగు హీరోలలో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యామిలీ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ మధ్య మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో సైలెంటుగా మళ్ళీ తన స్టైల్ సినిమాలు ఒప్పుకుని చేసుకుంటూ వెళ్తున్నాడు నాని. ఈ క్రమంలోని సౌర్యవ్ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో హాయ్ నాన్న అనే సినిమా చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నాని కుమార్తెగా బేబీ కియారా నటిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఫిక్స్ అయిన మేకర్స్ అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా తర్వాత ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న క్రమంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. గత రెండు మూడు రోజుల నుంచి నాని ప్రమోషన్స్ లో పాల్గొంటుండగా నాని కళ్ళకి ఉన్న ఒక కళ్ళజోడు హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఈ సన్ గ్లాసెస్ అవుట్ డోర్ లో పెట్టుకున్నాడు అంటే ఓకే కానీ క్లోజ్డ్ ఆడిటోరియమ్స్ లో కూడా పెట్టుకునే కనిపిస్తున్నాడు. అందరూ ఆయన అది స్టైల్ కోసమే పెట్టుకున్నాడు అనుకుంటున్నారు కానీ అది నిజం కాదని ఇన్ సైడ్ ఇన్ఫో.

Sukumar: లెక్కల మాష్టారు లెక్కేసి కొడితే 100 కోట్లు కూడా తక్కువే!

వాస్తవానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న “సరిపోదా శనివారం” సినిమా కోసం కొన్ని యాక్షన్ ఎపిసోడ్‌లను షూట్ చేస్తున్నప్పుడు నానికి యాక్సిడెంట్ అయిందని, అయన కంటికి గాయమైందని అంటున్నారు. ఆ గాయాన్ని కనపడకుండా ఉంచి కోలుకోవడానికి, డాక్టర్లు ఒక నెల రోజుల పాటు కూలింగ్ గ్లాస్ ధరించమని నానికి సూచించినట్లు తెలిసింది. ఖచ్చితంగా కళ్లజోడు ధరించడం కొనసాగించాల్సిన క్రమంలో నాని “హాయ్ నాన్నా” ప్రమోషన్స్ లో చాలా స్టైలిష్ లుక్ తో ఉన్న గ్లాసెస్ ధరించి కవర్ చేస్తున్నాడు అన్నమాట. ఇక ఓ వైపు నాని సరిపోదా శనివారం షూటింగ్‌లో బిజీగా ఉండగా మరో వైపు హాయ్ నాన్నకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా బిజీగా ఉన్నారు. నిన్న హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేసిన తర్వాత, ఈ వీకెండ్ చెన్నైలో ప్రచారం చేసందుకు వెళ్లారు. ఇక అక్కడ తమిళ వెర్షన్‌ను ప్రచారం చేయనున్నారు. ఇక హాయ్ నాన్నా డిసెంబర్ 7, 2024న సినిమాల్లోకి రాబోతోంది.

Exit mobile version