Site icon NTV Telugu

Nani: పాన్ ఇండియా ట్రైలర్ అనౌన్స్మెంట్ వచ్చేది ఈరోజే

Nani

Nani

బాహుబలి, KGF , RRR, కాంతార, పుష్ప తర్వాత పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న సినిమా ‘దసరా’. పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ ని మైంటైన్ చేస్తూ ఇన్నేళ్ళుగా హిట్స్ కొడుతూ వచ్చిన నాని సడన్ గా లుక్ లో హ్యూజ్ మేకోవర్ చూపిస్తూ ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే దసరా సినిమా టీజర్ రిలీజ్ అయ్యి మంచి హైప్ ని క్రియేట్ చేసింది. టీజర్ తో ప్రొమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేసిన దసరా చిత్ర యూనిట్ బ్యాక్ తు బ్యాక్ సాంగ్స్ తో అంచనాలను పెంచుతూనే ఉంది. ఇటివలే రిలీజ్ అయిన ‘చమ్కీల అంగేసి’ సాంగ్ అన్ని భాషల్లో చార్ట్ బస్టర్ అయ్యింది. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మేకర్స్, దసరా సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసి హైప్ ని ఆకాశం తాకేలా చెయ్యడానికి రెడీ అయ్యారు.

దసరా ట్రైలర్ ఏ రోజు రిలీజ్ చేస్తున్నారు అనే అఫీషియల్ టైం అండ్ డేట్ ని ఈరోజు సాయంత్రం అనౌన్స్ చెయ్యనున్నారు. ఈ ట్రైలర్ బయటకి వస్తే దసరా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరుగుతాయి. తమిళ మలయాళ కన్నడ భాషల్లో నాని దసరా సినిమాని ఇంకాస్త పుష్ చెయ్యాల్సి ఉంది కానీ ట్రైలర్ ని పర్ఫెక్ట్ గా కట్ చేస్తే చాలు నార్త్ లో బిజినెస్ ఆటోమేటిక్ అయిపోతుంది. దసరా టీజర్ ని కట్ చేసినట్లే మంచి మంచి షాట్స్ తో, ఎక్కువ కథ చెప్పకుండా క్యారెక్టర్ లోని స్వాగ్ ని ప్రెజెంట్ చేసేలా ట్రైలర్ ని కట్ చేస్తే చాలు నాని పాన్ ఇండియా ఆడియన్స్ దృష్టిలో పడినట్లే. అయితే సౌత్ విషయంలో మాత్రం నాని మరింత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చెయ్యాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న బజ్ ఆయా ఇండస్ట్రీల బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి సరిపోదు, నాని ఇంకా ఎక్కువ బజ్ ని క్రియేట్ చెయ్యాల్సిందే. మరి మార్చ్ 30 వరకూ టైం ఉంది కాబట్టి నేచురల్ స్టార్ ఏం చేస్తాడో చూడాలి.

Exit mobile version