NTV Telugu Site icon

Dasara Trailer: ఇలాంటి నానిని ఇప్పటివరకూ చూసి ఉండరు…

Dasara Trailer

Dasara Trailer

నాని అనగానే క్యూట్ లుక్స్ తో, అద్భుతమైన టాకేటివ్ స్కిల్స్ తో బ్యూటీఫుల్ లవ్ స్టొరీలో పక్కింటి కుర్రాడిలా నటించే అబ్బాయి గుర్తొస్తాడు కానీ కత్తులు పట్టుకోని, గొడ్డలి పట్టుకోని విలన్స్ పైన ఎటాక్ చేసే మాస్ హీరో గుర్తు రాడు. ఈసారి మాత్రం పక్కింటి కుర్రాడు కాదు పాన్ ఇండియా హీరో అనిపించే రేంజులో బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు నాని. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్న నాని, ఈ మూవీలో రా అండ్ రస్టిక్ రోల్ ప్లే చేస్తున్నాడు. నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తున్న నాని, మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ఇప్పటికే బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ దసరా సినిమాకి హ్యుజ్ హైప్ తెచ్చి పెట్టింది. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ దసరా ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. మార్చ్ 14న ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.

ఈ సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నాని… రెండు గొడ్డళ్ళు పట్టుకోని దహనం అవుతున్న రావణుడి ముందు నిలబడి ఉన్నాడు. నానిని ఇంత ఫియర్స్ లుక్ లో చూడడం ఇదే మొదటిసారి. పోస్టర్ అయితే అదిరిపోయింది అనే చెప్పాలి. టీజర్ కట్ చేసిన రేంజులో ట్రైలర్ కూడా ఉంటే మార్చ్ 30న నాని దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టేసినట్లే. అయితే ఇదే రోజున హిందీలో అజయ్ దేవగన్ నటించిన ‘భోలా’ సినిమా కూడా రిలీజ్ అవ్వనుంది. ఖైదీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీపై బాలీవుడ్ వర్గాల్లో భారి అంచనాలు ఉన్నాయి. స్ట్రెయిట్ హిందీ సినిమా, పైగా భారి అంచనాలు ఉన్న యాక్షన్ సినిమా కాబట్టి ‘భోలా’ మూవీ నుంచి నాని ‘దసరా’ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Show comments