Nani: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. మార్చి 30 న అన్ని భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో నాని.. సరికొత్తగా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. వన్ మ్యాన్ షోలా.. వన్ మ్యాన్ ప్రమోషన్స్ చేస్తూ ఇండస్ట్రీనే కుదిపేస్తున్నాడు. అన్ని రాష్ట్రాలు తిరుగుతూ సినిమా గురించిన విశేషాలను చెప్తూ హైప్ ఎక్కించేస్తున్నాడు. ఇక దసరా ప్రమోషన్స్ లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నాని క్యాస్టూమ్స్ గురించి. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు నాని తన డ్రెస్ ల మీద దసరా పోస్టర్లను, టైటిల్ ను డిజైన్ చేయించినవే వేసుకుంటున్నాడు. ఎక్కడికైనా వెళ్లని, అవే డిజైనర్ డ్రెస్ లలో కనిపిస్తున్నాడు. షర్ట్, టీషర్ట్, కోటు.. ఇలా డ్రెస్ ఏదైనా దసరా టైటిల్ మాత్రం కామన్. అందుకు తగ్గట్టుగానే నాని అల్ట్రా స్టైలిష్ లుక్ అదరగొట్టేస్తుంది.
Sayyesha Saigal: స్టార్ హీరో భార్యవి..ఒక బిడ్డ తల్లివి.. ఇలా ఐటెంసాంగ్ చేయడం ఏంటి అమ్మడు
ఇక చిత్ర బృందం మొత్తం కూడా దసరా టైటిల్ ఉన్న టీ షర్ట్స్ నే వాడుతుంది. దీంతో అభిమానులు.. అలాంటి టీ షర్ట్స్ యే తమకు కావాలని గోల చేసేస్తున్నారు. ముఖ్యంగా నాని షర్ట్ పై సిల్క్ స్మిత ఫోటోతో డిజైన్ చేయించింది అయితే ట్రెండింగ్ లిస్ట్ లో ఉందని చెప్పాలి. ఈ సినిమా తీయడానికి మేకర్స్ ఎంత ఖర్చుపెట్టారో.. అంతకుమించి ప్రమోషన్స్ కోసం ఖర్చుపెడుతున్నట్లు నాని చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. సినిమా హిట్ అయితే.. అవే డ్రెస్ లతో సక్సెస్ మీట్స్, సక్సెస్ టూర్స్ కు తిరగొచ్చు.. ఒకవేళ హిట్ అవ్వకపోతే.. ఆ డ్రెస్ లన్నింటినీ ఏం చేస్తారు అని అభిమానులు వింత అనుమానాలు రైజ్ చేస్తున్నారు. ఇక నాని డై హార్ట్ ఫ్యాన్స్ అయితే.. అన్నా అవేవో మాకు ఇస్తే నీ గుర్తుగా దాచుకుంటాం అని చెప్పుకొస్తున్నారు. మరి నాని ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంటాడో లేదో చూడాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.