Site icon NTV Telugu

Nani: మొదటిసారి 2 మిలియన్ మార్క్ టచ్ చేసిన నాని… స్టార్ హీరోలకి సవాల్

Nani

Nani

నేచురల్ స్టార్ నాని తన లుక్ ని పూర్తిగా మార్చేసి మాస్ లుక్ లోకి వచ్చి చేసిన సినిమా ‘దసరా’. మార్చ్ 30న రిలీజ్ అయిన ఈ మూవీతో నాని నేచురల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారాడు. రూటెడ్ కథతో, ఎమోషనల్ కంటెంట్ తో మాస్ సినిమా చేసిన నాని కెరీర్ లో మొదటిసారి వంద కోట్ల మార్క్ ని రీచ్ అయ్యాడు. ఫస్ట్ వీక్ కే వంద కోట్ల క్లబ్ లో చేరిన దసర సినిమా నాని కెరీర్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో ధరణిగా నాని చేసిన పెర్ఫార్మెన్స్ కి ఫిదా అవ్వని సినీ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన నటనతో ప్రేక్షకులని కట్టి పడేసిన నాని, సెకండ్ వీక్ లో కూడా మంచి బుకింగ్స్ ని రాబడుతున్నాడు. దాదాపు 400 థియేటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తున్న నాని, ఓవర్సీస్ లో కూడా కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ని కలెక్ట్ చేస్తున్నాడు. ఇటివలే వన్ మిలియన్ మార్క్ ని రీచ్ అయ్యి, మహేశ్ బాబు తర్వాత అత్యధిక సార్లు వన్ మిలియన్ మార్క్ సినిమాలు ఇచ్చిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు నాని.

Read Also: NTR 30: ఈరోజే లాస్ట్… యాక్షన్ ఎపిసోడ్ ని అదరగొట్టేసారట

లేటెస్ట్ గా 1.9 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసి ఈరోజుతో 2 మిలియన్ క్లబ్ లో చేరడానికి నాని రెడీ అయ్యాడు. ఓవర్సీస్ లో మహేశ్ బాబు, ప్రభాస్ లకి నాలుగు 2 మిలియన్ డాలర్ సినిమాలు ఉన్నాయి. వీరి తర్వాత ఎన్టీఆర్, చిరులకి మూడు 2 మిలియన్ డాలర్ సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లకి రెండు 2 మిలియన్ సినిమాలు ఉన్నాయి. వీరి తర్వాత వరుణ్ తేజ్, నితిన్, వెంకటేష్, విజయ్ దేవరకొండకి ఒక 2 మిలియన్ డాలర్ సినిమా ఉంది. ఇప్పుడు నాని ఈ ఎలైట్ లిస్టులో జాయిన్ అవుతున్నాడు. ఓవర్సీస్ లో నానికి మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో మరిన్ని 2 మిలియన్ డాలర్ సినిమాలు నాని లిస్టులో జాయిన్ అవ్వడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

Exit mobile version