NTV Telugu Site icon

Nani: స్టార్ హీరోలందరి రికార్డ్స్ బద్దలయ్యాయి… మిగిలింది మహేశ్ బాబు ఒక్కడే

Nani

Nani

శ్రీరామనవమి పండగ రోజున పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిన నాని, దసరా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఎన్ని హిట్స్ కొట్టినా టైర్ 2లోనే ఇన్ని ఏళ్లుగా ఉన్న నానిని టాప్ హీరోస్ పక్కన నిలబెడుతూ టైర్ 1 హీరోల సినిమాల రేంజులో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ని రాబడుతోంది దసరా సినిమా. సూపర్ హిట్ అనే మౌత్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో దసరా సినిమాని చూడడానికి సినీ అభిమానులు థియేటర్స్ కి క్యు కడుతున్నారు. మొదటి రోజు వరల్డ్ వైడ్ 38 కోట్ల గ్రాస్ రాబట్టిన దసరా సినిమా రెండో రోజు ముగిసే సమయానికి 53 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. వర్కింగ్ డే కావడంతో ఫ్రైడే కలెక్షన్స్ కాస్త తగ్గాయి కానీ ఈరోజు, రేపు దసరా సినిమా నెవర్ బిఫోర్ ఉపోరియా చూపించడం గ్యారెంటీగా కనిపిస్తోంది. మండే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా వసూళ్లు రాబడుతున్న దసరా సినిమా ఓవర్సీస్ లో కూడా అదే ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తోంది.

స్టార్ హీరోల రికార్డులని కూడా బద్దలుకోడుతూ నానిని టాప్ ప్లేస్ లో కూర్చునేలా చేస్తుంది దసరా సినిమా. యుఎస్ లో ఒకటిన్నర రోజులోనే 1 మిలియన్ టచ్ చేసిన దసరా సినిమా, సెకండ్ డే ఎండ్ అయ్యే టైంకి 1.2 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది దీంతో ఎన్టీఆర్ రికార్డ్ బ్రేక్ అయ్యింది. ఓవర్సీస్ లో ఎన్టీఆర్ కి ఇప్పటివరకూ 7 వన్ మిలియన్ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు నాని దసరా సినిమాతో ఎన్టీఆర్ ని వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ కి చేరాడు. నాని ఇప్పటివరకూ 8 సార్లు వన్ మిలియన్ డాలర్ సినిమాలని ఇచ్చాడు. ఏడు వన్ మిలియన్ డాలర్ సినిమాలతో ఎన్టీఆర్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ నుంచి ప్రభాస్, రామ్ చరణ్, చిరు లాంటి మిగిలిన స్టార్ హీరోలందరూ ఎన్టీఆర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టాప్ ప్లేస్ లో 11 వన్ మిలియన్ డాలర్స్ సినిమాలతో మహేశ్ బాబు టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఏ హీరోకైనా ఓవర్సీస్ మార్కెట్ డ్రీమ్ లాంటిదే, అలాంటి చోట మహేశ్ బాబు-నానిలు హ్యుజ్ మార్కెట్ ని సెట్ చేసుకున్నారు.

Show comments