నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ స్టోరీని నాని రివీల్ చేసేశాడు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో పలువురు విలేఖరులు సినిమా గురించి ప్రశ్నించగా, చెప్పొచ్చో లేదో అంటూనే కొన్ని విషయాలను చెప్పేశారు నాని. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోల్‌కతాలో 1970 సంవత్సరంలో జరిగే కథ నేపథ్యంలో జరుగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.
బెంగాలీ అమ్మాయి, తెలుగు కుర్రాడి కథను ‘శ్యామ్ సింగ రాయ్’ ద్వారా చెప్పాలనుకున్నాడు. టీజర్ ఇప్పటికే దానిని నిరూపించింది. అయితే ఇందులో బెంగాలీ డైలాగ్ ఉండడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. నాని, ఆయన బృందం కేవలం టీజర్ కోసమే ఈ బెంగాలీ డైలాగ్ వాడారా? లేదా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లలో మొత్తం చిత్రం ఈ బెంగాలీ ఫ్లేవర్‌తో ఉందా? అని డౌట్ వస్తోంది. నాని, సాయి పల్లవి సెంట్రల్ కలకత్తాలో నివసించే బెంగాలీ జంటగా నటించారు. దేవదాసీ సంప్రదాయాన్ని వ్యతిరేకించే వ్యక్తులుగా హీరోహీరోయిన్లు కన్పించబోతున్నారు. ఇందులో సాయి పల్లవి దేవదాసీగా కన్పించగా, నాని మాత్రం జర్నలిస్ట్ గా కన్పించబోతున్నాడు. టీజర్లో వచ్చిన ‘రాయడమే కాదు కాల రాయడం కూడా తెలుసనీ అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ‘శ్యామ్ సింగ రాయ్’ అనే డైలాగ్ ఈ విషయాన్నీ స్పష్టం చేసింది.
Read also : ప్రెస్ మీట్ లో బోరున ఏడ్చేసిన హీరో… అభిమానులకు రిక్వెస్ట్
కాగా నాని విలేఖరి వ్యక్తం చేసిన పలు అనుమానాలను క్లియర్ చేస్తూ సినిమా బెంగాలీ నేపథ్యంలో ఉంటుందని, శ్యామ్ అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ అని, కానీ డైలాగులన్నీ బెంగాలీలో ఏం ఉండవని అన్నారు. ఈ పీరియాడికల్ ఎపిక్ లవ్ స్టోరీలో “స్త్రీ ఎవరికీ బానిస కాదు.. చివరికి ఆ దేవుడికి’ కూడా అని చెప్పడంతో ఇది పునర్జన్మల నేపథ్యంలో రూపొందిన సినిమా అన్పిస్తోంది. ఈ విషయంపై నాని స్పందిస్తూ తినబోయే ముందు అన్నీ వంటల మూతలు ఓపెన్ చేసి చూపించడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చాడు. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడిస్తామని అన్నారు. దీని బట్టి సినిమా పునర్జన్మల నేపథ్యంలో దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా తెరకెక్కుతున్న పీరియాడికల్ ఎపిక్ లవ్ స్టోరీ అన్న విషయం క్లియర్ అయిపొయింది.