షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘జెర్సీ’ మేకింగ్ వీడియో నిన్న విడుదలైంది. తెలుగులో నాని హీరోగా నటించిన సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ 2019లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ అదే పేరుతో ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. అయితే తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కావడం విశేషం. తాజాగా విడుదలైన సినిమా హిందీ ట్రైలర్ పై నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఓ ప్రముఖ మీడియాతో నాని మాట్లాడుతూ హిందీ ‘జెర్సీ’ ట్రైలర్‌పై నాని తన ఆలోచనలను పంచుకున్నాడు. “నాకు ట్రైలర్ నచ్చింది. సినిమాలో సోల్ చెక్కు చెదరకుండా ఉందని నేను భావిస్తున్నాను. సాధారణంగా రీమేక్ చిత్రాలు మంచి నిర్మాణ విలువలు కలిగి ఉండవచ్చు, చక్కగా తెరకెక్కిస్తారు. అందులో అన్నీ ఉన్నా కానీ కొన్నిసార్లు ఒరిజినల్ లోని మ్యాజిక్, లేదా సోల్ మిస్ అవుతుంది. కానీ ‘జెర్సీ’ ట్రైలర్ చూస్తే అలా అనిపించలేదు. ఈ మూవీ విడుదలయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుందని నేను భావిస్తున్నాను” అని నాని అన్నారు.
నాని ఇంకా డైరెక్టర్ గౌతమ్‌తో టచ్‌లో ఉన్నాడు. గౌతమ్ గురించి నాని మాట్లాడుతూ “ఆయన నాకు చాలా తరచుగా కాల్ చేస్తాడు. హిందీ విడుదలకు సంబంధించిన విషయాలను పంచుకుంటాడు. ఒకసారి ఎడిట్‌ని లాక్ చేసి, నాకు ఫోన్ చేసి చాలా సంతోషించారు. కొన్ని సార్లు ‘శ్యామ్ సింగ రాయ్’ సెట్‌కి వచ్చి ‘జెర్సీ’ లొకేషన్‌లను, దానికి సంబంధించిన ఫోటోలను అన్నింటిని నాకు చూపించాడు. సినిమా బాగా వస్తుందని భావిస్తున్నాను” అని అన్నారు. ప్రస్తుతానికి తాను తన నెక్స్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నానని, అయితే డిసెంబర్ 31న విడుదలయ్యే ‘జెర్సీ’ని తప్పకుండా చూస్తానని నాని పేర్కొన్నాడు. కాగా ‘శ్యామ్ సింగ రాయ్’లో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించగా, ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల కానుంది.
Read Also :
