Nani:న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మేడ్ స్టార్స్ లో చిరంజీవి, రవితేజ తరువాత నాని పేరే చెప్పుకొస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కథలను ఎంచుకొనే విధానంలో నానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ మధ్య నాని చేసిన సినిమాలు అన్ని హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. శ్యామ్ సింగరాయ్ సినిమా మొదలు అంటే సుందరానికి, అతిధి పాత్ర చేసిన హిట్ 2, దసరా, హాయ్ నాన్న మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు కలెక్షన్లు కూడా రాబట్టి హిట్ అందుకున్నాయి. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఒక పక్క సినిమాలలో హీరోగా నటిస్తూనే మరోపక్క నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నాడు. తాను నటించే సినిమాలు ఎంత భిన్నంగా ఉండేలా చూసుకుంటాడో తాను నిర్మించే సినిమాలను కూడా అంతకు నుంచి విలక్షణంగా, విభిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాడు.
ఇక ఇప్పుడు నాని వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తూ మరింత బిజీగా మారాడు. సాధారణంగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను హీరోయిన్ల కెరీర్ లో వాడుతూ ఉంటాం. స్టార్ డమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవడానికి సినిమాలు చేస్తూనే.. యాడ్స్ కూడా చేస్తూ రెండు చేతులా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. తాజాగా నాని కూడా వాణిజ్య ప్రకటనలను చేస్తూ రెండు చేతులా సంపాదించడం నేర్చుకున్నాడు. నాని ప్రస్తుతం టాప్ బ్రాండ్స్ అయిన ఒట్టో, స్ప్రైట్, మినిట్ మెయిడ్ తో సహా అనేక ఇతర బ్రాండ్‌లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు నాని లిస్టులో క్లోజ్ అప్ టూత్‌పేస్ట్ కూడా చేరింది. తాజాగా నాని క్లోజ్ అప్ టూత్‌పేస్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. ఈ విషయాన్ని నాని అధికారికంగా ప్రకటిచాడు. త్వరలోనే నాని చేసిన కొత్త యాడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకరకంగా నాని ఇప్పుడు చేతిలో వరుస సినిమాలు, బ్రాండ్ లతో దూసుకు పోతున్నాడు. ఇక సరిపోదా శనివారం సినిమా తరువాత నాని, సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ విషయం మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
