Nandamuri Taraka Ramarao Son of Nandamuri Janakiram to be Launched Soon: నందమూరి అభిమానులు అందరూ ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని దాదాపు 7, 8 ఏళ్ల నుంచి ప్రచారం జరగడమే తప్ప ఎప్పుడు ఉంటుందని విషయం మీద క్లారిటీ లేదు. అనేక మంది స్టార్ డైరెక్టర్లతో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతూ వచ్చింది కానీ అది నిజం కాలేదు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే మోక్షజ్ఞ కంటే ముందే నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ హీరో ఇంకెవరో కాదు, నందమూరి హరికృష్ణ కుమారుడు దివంగత నందమూరి జానకిరామ్ పెద్ద కుమారుడు అని తెలుస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతని పేరు కూడా నందమూరి తారక రామారావే. ఇప్పటికే తారక రామారావు అతనొక్కడే సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కూడా నటించాడు.
Gopi Sundar: మళ్ళీ దొరికేశాడు.. ఫ్యామిలీ స్టార్ రెండో పాట అక్కడి నుంచి తస్కరించిందా?
ఇప్పుడు అతన్ని హీరోగా లాంచ్ చేయడానికి ఆ కుటుంబానికి వీరవిధేయుడు లాంటి డైరెక్టర్ సిద్ధమవుతున్నారు. ఆయన ఎవరో కాదు వైవీఎస్ చౌదరి. సాయి ధరంతేజ్ హీరోగా 2015 వ సంవత్సరంలో రేయ్ అనే సినిమా చేసి దారుణమైన డిజాస్టర్ అందుకున్న వైవిఎస్ చౌదరి అప్పటి నుంచి సినిమాలకు దూరమయ్యారు. సుమారు 9 ఏళ్ల తర్వాత ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్నారని జానకిరామ్ కుమారుడిని లాంచ్ చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించబోతున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. చూడాలి ఇందులో ఎంతవరకు నిజమవుతుంది అనేది.